Mahindra XUV300 Electric: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ వాహనం

Mahindra XUV300 Electric: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. ఇక సామాన్యుడికి ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు వాహనాల..

Mahindra XUV300 Electric: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ వాహనం
Follow us
Subhash Goud

|

Updated on: Jun 01, 2022 | 7:17 PM

Mahindra XUV300 Electric: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. ఇక సామాన్యుడికి ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ వాహనాలు అందుబాటులోకి వస్తుండటంతో వాహనదారులు కూడా వాటివైపు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్‌ వీలర్‌ వాహనాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇక తాజాగా మహీందర్ అండ్‌ మహీంద్రా కూడా ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో అడుగులు వేస్తోంది. ఇక వచ్చే సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి బార్న్‌ ఎలక్ట్రిక్‌ విజన్‌ పేరిట ఈ సంవత్సరం ఆగస్టు నెలలో బ్రిటన్‌లో ఆవిష్కరించనున్నట్లు ఎంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు. XUV300కి ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ అయినప్పటికీ కొత్త వాహనం పొడవు 4.2 మీటర్ల స్థాయిలో ఉంటుందని తెలిపారు. కాగా, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉపయోగించే మాడ్యులర్‌ ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ మ్యాట్రిక్స్‌ పరికరాల కోసం మహీంద్రా ఇటీవల ఫోక్స్‌ వ్యాగన్‌తో ఒప్పందం కుదుర్చుంది. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి