Stock Market: ఈ వారం మార్కెట్లపై కరోనా వేరియంట్ ప్రభావం చూపుతుందా.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు..

కరోనా కొత్త వేరియంట్‌ ఈ వారం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం, 'ఓమిక్రాన్'కి సంబంధించిన వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు పడిపోయాయి...

Stock Market: ఈ వారం మార్కెట్లపై కరోనా వేరియంట్ ప్రభావం చూపుతుందా.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు..
Stock Market
Follow us

|

Updated on: Nov 28, 2021 | 12:58 PM

కరోనా కొత్త వేరియంట్‌ ఈ వారం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం, ‘ఓమిక్రాన్’కి సంబంధించిన వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు పడిపోయాయి. నవంబర్‌లో స్థూల ఆర్థిక గణాంకాలు, ఆటో కంపెనీల నెలవారీ విక్రయ గణాంకాలు కూడా మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కమిటీ కొత్త వేరియంట్‎కు ‘ఓమిక్రాన్’ అని పేరు పెట్టింది. ఓమిక్రాన్ అనేది డెల్టా వంటి కోవిడ్ వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్ రూపమని కమిటీ చెబుతోంది. బోట్స్వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. Omicron వ్యాప్తిని ఆపడానికి అనేక దేశాలు దక్షిణ ఆఫ్రికా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించాయి.

కోవిడ్ యొక్క కొత్త రూపమే కాకుండా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐలు) వైఖరి, స్థూల డేటా ఈ వారం మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. కోవిడ్‌కు సంబంధించిన పరిణామాలు ప్రధానంగా మార్కెట్‌కు ముఖ్యమైనవి అని చెప్పారు. శామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యేషా షా మాట్లాడుతూ, “క్యూ2 ఫలితాల తర్వాత, దలాల్ స్ట్రీట్ స్థూల గణాంకాలపై దృష్టి సారిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సమీక్ష సమావేశం డిసెంబర్‌లో జరగనుంది, కాబట్టి ద్రవ్యోల్బణం కూడా ప్రధాన అంశంగా ఉంటుందని చెప్పారు. నవంబర్ నెలలో వాహన విక్రయాల గణాంకాలు కూడా ఈ వారం మార్కెట్‌లో ఒడిదుడుకులకు కారణం కావచ్చన్నారు.

కొత్త కోవిడ్ వేరియంట్, ద్రవ్యోల్బణం డేటా, సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య సమీక్ష సమావేశానికి సంబంధించిన వార్తలు భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ హెడ్ – ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. కొత్త కరోనా వైరస్ వేరియంట్‌పై ఆందోళనల మధ్య శుక్రవారం సెన్సెక్స్ 1,688 పాయింట్లు కోల్పోయింది.

Read Also.. SIP calculator: 25 సంవత్సరాల్లో రూ.10 కోట్లు రావాలంటే.. సిప్ ఎంత కట్టాలి..