Pan Card Reprint: మీ పాన్ కార్డు పోయిందా? కేవలం రూ.50తో ఇంటి నుంచే రీప్రింట్ చేసుకోవచ్చు..
ఇటీవల కాలంలో ప్రతి వ్యక్తికి పాన్ కార్డు ఉండడం అనేది తప్పనిసరైంది. అయితే పాన్ ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల అది విరిగిపోతుంది లేదా రంగు మారిపోతుంది. లేకపోతే ఒక్కోసారి పాన్‌కార్డును ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేకుండా సులభంగా పాన్ కార్డును పొందవచ్చని చాలా మందికి తెలియదు.
ఇటీవల కాలంలో బ్యాంకు ఖాతాను తెరవడానికి పాన్ కార్డ్ తప్పనిసరైంది. పాన్ కార్డు అంటే మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి ముఖ్యమైన పత్రం. ఆర్థిక లావాదేవీలు జరిగే దాదాపు అన్నిచోట్ల ప్రభుత్వం దీనిని అడుగుతుంది. పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం మొదలైన సమయంలో డాక్యుమెంట్ ప్రూఫ్‌గా కూడా ఇది ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రతి వ్యక్తికి పాన్ కార్డు ఉండడం అనేది తప్పనిసరైంది. అయితే పాన్ ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల అది విరిగిపోతుంది లేదా రంగు మారిపోతుంది. లేకపోతే ఒక్కోసారి పాన్‌కార్డును ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేకుండా సులభంగా పాన్ కార్డును పొందవచ్చని చాలా మందికి తెలియదు. అయితే మీరు పాన్‌కార్డును తిరిగి పొందడానికి ఇంటి నుంచే అప్లై చేస్తే సరిపోతుంది. పైగా నామమాత్రపు రుసుముతో పాన్ కార్డును పొందవచ్చు. ఆ వివరాలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం.
పాన్ కార్డ్ రీప్రింట్ రుసుము
స్థానిక ఏజెన్సీలు పాన్ కార్డు రీప్రింట్ చేయడానికి వాస్తవ రుసుము కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్త పాన్ కార్డు కోసం ఏకంగా రూ.300 నుంచి రూ.500 వరకూ డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ రుసుము కేవలం రూ.50 మాత్రమే. అవును మీరు కేవలం రూ. 50 చెల్లించి పాన్ కార్డ్‌ని మళ్లీ ముద్రించవచ్చు. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో? ఓసారి తెలుసుకుందాం.
పాన్ కార్డ్ రీప్రింట్
- ముందుగా గూగుల్‌కు వెళ్లి రీప్రింట్ పాన్ కార్డ్‌ని సెర్చ్ చేయండి.
- మీరు ఎన్‌ఎస్‌డీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో రీప్రింట్ పాన్ కార్డ్ ఎంపికను పొందుతారు. దానిపై క్లిక్ చేయాలి.
- వెబ్‌సైట్‌ను సందర్శించి పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ వంటి మీ పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి.
- నిబంధనలు, షరతులను అంగీకరించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దానిపై మీ పాన్ కార్డ్‌కు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ముందుకు వెళ్లే ముందు దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి.
- వివరాలను ధ్రువీకరించిన తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
- అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయాలి.
- అనంతరం కొత్త పాన్ కార్డ్ పొందడానికి రూ. 50 రుసుము చెల్లించాలి.
- అయితే పాన్ కార్డ్ కోసం రుసుము చెల్లించడానికి నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐను ఉపయోగించవచ్చు.
- చెల్లింపు తర్వాత మీ డూప్లికేట్ పాన్ కార్డ్ 7 రోజుల్లో డెలివరీ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి