Bank Locker Key: మీ బ్యాంక్ లాకర్ కీ పోయిందా? మళ్లీ తిరిగి పొందడానికి ఇవి తప్పనిసరి
బ్యాంకు మీకు అందించిన లాకర్ కీ పోయినా లేకపోతే ఎవరైనా దొంగలిస్తే చాలా మందికి ఏం చేయాలో? తెలియదు. అయితే లాకర్ కీ పోయినట్లయితే బ్యాంకు కొత్త కీని జారీ చేస్తుంది కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి కొత్త కీను పొందడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.

బ్యాంకులు తమ ఖాతాదారులకు సేఫ్ డిపాజిట్ లాకర్ (ఎస్‌డీఎల్) సదుపాయాన్ని అందజేస్తాయి, ఇది కస్టమర్‌లు తమ విలువైన వస్తువులను నిల్వ చేసుకోవడానికి సహాయపడుతుంది. దీనితో పాటు, బ్యాంకులు లాకర్ల కోసం వాటి పరిమాణాన్ని బట్టి కొంత మొత్తాన్ని కూడా వసూలు చేస్తాయి. బ్యాంక్ యజమానికి ఒక కీని అందజేస్తుంది. మరొకటి తన వద్ద ఉంచుకుంటుంది. రెండు కీలు స్థానంలో ఉంటే తప్ప, లాకర్ ఓపెన్ అవ్వదు. కానీ బ్యాంకు మీకు అందించిన లాకర్ కీ పోయినా లేకపోతే ఎవరైనా దొంగలిస్తే చాలా మందికి ఏం చేయాలో? తెలియదు. అయితే లాకర్ కీ పోయినట్లయితే బ్యాంకు కొత్త కీని జారీ చేస్తుంది కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి కొత్త కీను పొందడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
కొత్త లాకర్ కీ కోసం ఖాతాదారుడు వెంటనే బ్యాంకుకు సమాచారం అందించాలి. కస్టమర్ ఎల్లప్పుడూ ఖరీదైన ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను బ్యాంక్ లాకర్‌లో ఉంచుతారు. కాబట్టి విషయం ఎల్లప్పుడూ సున్నితంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు బ్యాంక్ లాకర్ కీ పోయినందుకు సంబంధించి బ్యాంకులో ఫిర్యాదు నమోదు చేయాలి. అనంతరం లాకర్ కీ, నంబర్‌కు సంబంధించిన అన్ని అవసరమైన వివరాలను అందించి బ్యాంకుకు దరఖాస్తు చేయాలి. దీనితో పాటు, పోలీసు రిపోర్ట్ లేదా నమోదైన ఫిర్యాదు రసీదు కాపీని అప్లికేషన్‌కు జతచేయాలి. దీని తర్వాత కొత్త కీ కోసం బ్యాంక్ మీకు ఛార్జ్ చేస్తుంది. కొత్త కీని సేకరించడానికి లాకర్ అద్దెదారు పేర్కొన్న సమయం, ప్రదేశంలో ఉండాలి. అయితే, డూప్లికేట్ కీ లాకర్‌లో తారుమారు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కస్టమర్ కోరుకుంటే అతను మొదటి లాకర్‌ను పగలగొట్టి అన్ని వస్తువులను రెండో లాకర్‌కు మార్చవచ్చు.
ఈ ప్రక్రియ మొత్తం ఖర్చును కస్టమర్ భరించాల్సి ఉంటుంది. లాకర్‌ను తెరిచినందుకు/పోగొట్టుకున్న కీని రీప్లేస్ చేసినందుకు ఛార్జీలు, అదనంగా రూ. 1,000 (జీఎస్టీ మినహాయించి) అద్దెదారు నుంచి రికవరీ చేస్తారు. ఈ ఖర్చు ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు మారవచ్చు. అయితే పోగొట్టుకున్న కీ భవిష్యత్తులో దొరికితే బ్యాంకుకు అందజేస్తామని కూడా కస్టమర్ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మొత్తం ప్రాసెసింగ్ ఖర్చు కస్టమర్ నుంచి తీసుకుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..