Liquor Shops Closed: ఆ మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 6 రోజుల పాటు మద్యం షాపులు బంద్!
ఈ రోజుల్లో మద్యం ప్రియులకు మద్యం లేకుండా ఉండని పరిస్థితి ఉంది. ఏదైనా సందర్భంలో మద్యం షాపులు బంద్ ఉంటున్నాయని తెలిస్తే చాలు ముందుగానే స్టాక్ చేసుకుని ఉంచుకుంటారు. మద్యం షాపుల ముందు బారులు తీరి ఉంటారు. రోజువారికంటే ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తుంటారు..
ఈ రోజుల్లో మద్యం ప్రియులకు మద్యం లేకుండా ఉండని పరిస్థితి ఉంది. ఏదైనా సందర్భంలో మద్యం షాపులు బంద్ ఉంటున్నాయని తెలిస్తే చాలు ముందుగానే స్టాక్ చేసుకుని ఉంచుకుంటారు. మద్యం షాపుల ముందు బారులు తీరి ఉంటారు. రోజువారికంటే ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తుంటారు. అయితే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఈ ఎన్నికల ప్రభావం ఢిల్లీపై కూడా పడనుంది. ఢిల్లీలోని హర్యానా సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో ఉన్న లైసెన్స్‌లు కలిగిన దుకాణాలు మూడు రోజుల పాటు మూసివేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మూడు రోజులు ఓటింగ్‌కు ముందు అంటే అక్టోబర్ 3 సాయంత్రం 6:00 గంటల నుండి అక్టోబర్ 5 సాయంత్రం 6:00 గంటల వరకు మద్యం షాపులు మూసి ఉంటాయి. హర్యానా సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోని దుకాణాలకు ఈ నియమం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అయితే హర్యానా ఎన్నికల ఓటింగ్ ముగియడానికి 48 గంటల ముందు అంటే అక్టోబర్ 3 సాయంత్రం 6 గంటల నుండి అక్టోబర్ 5 సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసి ఉండనున్నాయి. ఇదిలా ఉండగా, అక్టోబర్ నవంబర్ నెలలో మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా 6 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. మరి ఏయే తేదీల్లో తెలుసుకుందాం.
ఢిల్లీలో మొత్తం 6 రోజుల పాటు మద్యం షాపుల బంద్
ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో ఆరు రోజుల పాటు మద్యం షాపులు మూసి వేయనున్నారు. హర్యానా ఎన్నికలే కాకుండా మరిన్ని రోజులు మద్యం షాపులను మూసివేసేందుకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అక్టోబర్, నవంబర్‌లలో జాతీయ సెలవులు కాకుండా, ఢిల్లీలోని మద్యం దుకాణాలు మరికొన్ని రోజులలో కూడా మూసివేయనున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో దేశ రాజధానిలో దాదాపు ఆరు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయని ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
సెప్టెంబరు 19న విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ 2010లోని రూల్ 52లోని నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, జాతీయ రాజధాని ఢిల్లీలోని ఈ కింది తేదీలను డ్రై డే తేదీలుగా ప్రకటించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: 3 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్.. జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీ
ఎల్-15, ఎల్-15ఎఫ్ లైసెన్సులు ఉన్న హోటళ్ల విషయంలో మద్యం సేవించేందుకు డ్రై డేలో మద్యం అమ్మకాలపై నిషేధం వర్తించదని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ డ్రైడే రోజులు జాతీయ సెలవులు, మతపరమైన పండుగలు ఉన్నాయి.
అక్టోబర్:
అక్టోబర్‌లో మొత్తం నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి ఉంటాయి.
- అక్టోబర్ 2 – గాంధీ జయంతి (బుధవారం)
- అక్టోబర్ 12 – విజయ దశమి (శనివారం)
- అక్టోబర్ 17 – మహర్షి వాల్మీకి జయంతి (గురువారం)
- అక్టోబర్ 31 – దీపావళి (గురువారం)
నవంబర్:
నవంబర్‌లో మొత్తం రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి ఉంటాయి.
- నవంబర్ 15 – గురునానక్ జయంతి (శుక్రవారం)
- నవంబర్ 24 – గురు తేజ్ బహదూర్ షహీదీ దివస్ (ఆదివారం)
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2000
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి