AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Smart Pension: ఎల్ఐసి నుంచి మరో అద్భుతమైన పెన్షన్‌ స్కీమ్‌.. ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి..

LIC Smart Pension Plan: ప్రభుత్వ రంగ ఎల్ఐసి నికర ప్రీమియం ఆదాయం తాజా మూడవ త్రైమాసికంలో 9% తగ్గి రూ.1.07 లక్షల కోట్లకు చేరుకుంది. దీనికి సింగిల్ ప్రీమియం వసూళ్లలో 24% తగ్గుదల, మొదటి సంవత్సరం ప్రీమియం వసూళ్లలో 14% క్షీణత కారణమైంది. డిసెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల..

LIC Smart Pension: ఎల్ఐసి నుంచి మరో అద్భుతమైన పెన్షన్‌ స్కీమ్‌.. ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి..
Subhash Goud
|

Updated on: Feb 18, 2025 | 10:06 AM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన కొత్త ప్లాన్‌ ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్‌ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 18, 2025 నుండి ఇది అందుబాటులో ఉంటుంది. ‘స్మార్ట్ పెన్షన్’ ప్లాన్ అనేది ‘నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, ఇండివిజువల్/గ్రూప్, సేవింగ్స్, ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్.  ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్, భారతదేశంలో పెన్షన్, పదవి విరమణ పొదుపు మార్కెట్‌లో LIC నాయకత్వ స్థానాన్ని మరింత బలపరిచే అవకాశం ఉంది. జనాభా పెరుగుతుండగా, వారు తమ ఆర్థిక భవిష్యత్తును భద్రపరచుకోడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో పెన్షన్ ప్రోగ్రాములు ఒక ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి.  దీని గురించి మరిన్ని వివరాలు అందించనున్నాము.

డ్రాప్ డౌన్ జాబితా నుండి తగిన డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోవడం ద్వారా ధృవీకరణ కోసం మీ పత్రాలను స్కాన్ చేసి అప్‌డేట్ చేయండి. ఆ తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. ఈ నంబర్‌తో మీరు ఈ పోర్టల్ నుండి అప్‌డేట్ స్థితిని తెలుసుకోవచ్చు.

ప్రభుత్వ రంగ ఎల్ఐసి నికర ప్రీమియం ఆదాయం తాజా మూడవ త్రైమాసికంలో 9% తగ్గి రూ.1.07 లక్షల కోట్లకు చేరుకుంది. దీనికి సింగిల్ ప్రీమియం వసూళ్లలో 24% తగ్గుదల, మొదటి సంవత్సరం ప్రీమియం వసూళ్లలో 14% క్షీణత కారణమైంది. డిసెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల పరిహారం, సంక్షేమ ఖర్చులు దాదాపు మూడింట ఒక వంతు తగ్గడంతో ఎల్‌ఐసీ ఇప్పటికీ పన్ను తర్వాత లాభంలో 17% పెరుగుదల రూ. 11,056 కోట్లను నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

LIC కొత్త వ్యాపారం విలువ (VNB), అంటే కొత్త ప్రీమియంల నుంచి నమ్మదగిన లాభం, గత సంవత్సరం నుండి 27% తగ్గి రూ.1,926 కోట్లుగా ఉంది. LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్ నుంచి మీరు పొందే మొత్తం కొనుగోలు ధర, ఎంచుకున్న యాన్యుటీ ఎంపిక వాయిదా వ్యవధి మీద ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి