AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువు ఎప్పటి వరకో తెలుసా..?

Aadhaar Update: ఆధార్‌లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఈ అప్‌డేట్‌ అనేది పూర్తిగా ఉచితం. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు దాటిన తర్వాత అప్‌డేట్‌ కోసం రూ.50 చొప్పున ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఉచిత ఆధార్..

Aadhaar Update: ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువు ఎప్పటి వరకో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Feb 18, 2025 | 9:25 AM

Share

ఆధార్‌.. మన దేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. సిమ్‌ కార్డు తీసుకున్న దగ్గరి నుంచి బ్యాంకు అకౌంట్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇలా ఒక్కటేమిటి ఎన్నో వాటికి ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. అయితే గతంలో యుఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. ఆధార్‌ తీసుకుని పది సంవత్సరాలు అయినట్లయితే ఆధార్‌లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఈ అప్‌డేట్‌ అనేది పూర్తిగా ఉచితం. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు దాటిన తర్వాత అప్‌డేట్‌ కోసం రూ.50 చొప్పున ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్‌కు గత ఏడాది డిసెంబర్ 14 వరకు చివరి రోజు ఉండేది. కానీ ఆ తర్వాత కేంద్రం మరోసారి గడువు పెంచింది.

ఈ ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ కోసం గడువు ఈ ఏడాది జూన్‌ 14 వరకు ఉంది. మీరు మీ ఆధార్ కార్డ్, పేరు, చిరునామా మొదలైనవాటిని ఉచితంగా (UIDAI) మార్చాలనుకుంటే, మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆధార్ సెంటర్‌లో అప్‌డేట్ చేయడానికి ఎటువంటి రుసుము ఉండదు. UIDAI వెబ్‌సైట్ నుండి ఆధార్ కార్డ్ డెమోగ్రాఫిక్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు గడుస్తున్న వారు తప్పనిసరిగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

గత ఏడాది జూన్ 14, 2024 గడువు ఉండేది. తర్వాత ఈ గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి ఈ గడువును పొడిగించింది. అంటే జూన్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

దీని ద్వారా దేశంలోని కోట్లాది మంది ఆధార్ కార్డు వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. మీరు మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి ఎటువంటి ఖర్చు లేకుండా చేసుకునే వెసులుబాటు ఉంది.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును ఎలా అప్‌డేట్ చేయాలి?

➦ ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌లో సందర్శించాలి.

➦ మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, మీ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయడం ద్వారా మీ ప్రొఫైల్ ఓపెన్‌ అవుతుంది.

➦ ఇప్పుడు మీరు డాక్యుమెంట్ అప్‌డేట్ విభాగంలో అప్‌డేట్ చేయాలనుకుంటున్న మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి.

➦ డ్రాప్ డౌన్ జాబితా నుండి తగిన డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోవడం ద్వారా ధృవీకరణ కోసం మీ పత్రాలను స్కాన్ చేసి అప్‌డేట్ చేయండి.

➦ ఆ తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. ఈ నంబర్‌తో మీరు ఈ పోర్టల్ నుండి అప్‌డేట్ స్థితిని తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us