AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphones: కొత్త రికార్డ్‌.. ఈ ఏడాది 10 నెలల్లో భారతదేశం నుండి ఎన్ని స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు అయ్యాయో తెలుసా?

Smartphone Exports From India: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జనవరి వరకు 10 నెలల్లో భారతదేశం నుండి లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. ఆ మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ.1.31 లక్షల కోట్లు మాత్రమే. ఈ సంవత్సరం..

Smartphones: కొత్త రికార్డ్‌.. ఈ ఏడాది 10 నెలల్లో భారతదేశం నుండి ఎన్ని స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు అయ్యాయో తెలుసా?
Subhash Goud
|

Updated on: Feb 17, 2025 | 4:34 PM

Share

ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మొదటి 10 నెలల్లో భారతదేశం నుండి ఎగుమతి చేసిన స్మార్ట్‌ఫోన్‌ల విలువ రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటింది. నివేదిక ప్రకారం, ఏప్రిల్, జనవరి మధ్య రూ.1.55 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. జనవరిలోనే రూ.25,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. గత ఏడాది (2024) జనవరితో పోలిస్తే ఈసారి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 10% పెరిగాయి. 140 శాతం పెరుగుదల ఉంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి రూ.1.31 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. ఏప్రిల్ 2023 నుండి జనవరి 2024 వరకు 10 నెలల్లో రూ.99,120 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో ఎగుమతులు 56 శాతం పెరగడం గమనార్హం. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని చేరుకున్నా ఆశ్చర్యం లేదు. కేంద్రం మంత్రి వైష్ణవ్ ప్రకారం.. ఈ మొత్తం ఆర్థిక సంవత్సరం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ.1.70 లక్షల కోట్లు చేరుకోవచ్చు.

భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఐఫోన్ వాటా సింహభాగం:

భారతదేశం నుండి ఎగుమతి అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ భాగం ఆపిల్ ఐఫోన్‌లే. ఈ ఐఫోన్ ఎగుమతులకు ఫాక్స్‌కాన్ సహకారం 100%. కోలార్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ నుండి విదేశాలకు పెద్ద సంఖ్యలో ఐఫోన్‌లు సరఫరా అవుతున్నాయి. ఐఫోన్ తర్వాత అత్యధికంగా ఎగుమతి అయ్యే స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్. భారతదేశం మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో శామ్‌సంగ్ ఫోన్‌ల వాటా 10% ఉంది.

దశాబ్దం క్రితం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో భారతదేశం 67వ స్థానంలో ఉండేది. భారతదేశంలో ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌లను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేవారు. 2020లో PLI పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల ఉంది. ఎగుమతులు ఏటా పెరుగుతున్నాయి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!