LIC IPO: పాలసీ హోల్డర్లకు ఐపీఓలో ఎల్ఐసీ షేర్లు!
LIC IPO News: దేశంలో ప్రస్తుతం ఐపీఓల క్రేజ్ నడుస్తోంది. అందులోనూ ఎల్ఐసీ మార్కెట్ అరంగేట్రం చేయనుందని వార్త వచ్చిననాటి నుంచి దానిపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి.
LIC IPO News: దేశంలో ప్రస్తుతం ఐపీఓల క్రేజ్ నడుస్తోంది. అందులోనూ ఎల్ఐసీ మార్కెట్ అరంగేట్రం చేయనుందని వార్త వచ్చిననాటి నుంచి దానిపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు అందరి ఆసక్తి తమవైపు తిప్పుకుంటున్న వార్త ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు(LIC Policy Holders) షేర్లు మిగిలిన వారి కన్నా 5 శాతం తక్కువకు ఇచ్చే ఉద్ధేశంలో సంస్థ ఉన్నట్లు వస్తున్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. పాలసీ దారులకోసం ఎల్ఐసీ అమ్మకానికి ఉంచిన మెుత్తంలో 10 శాతం వాటాలను రిజర్వు(Shares Reservation) చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే ఎల్ఐసీ వద్ద ప్రస్తుతం వివిధ రకాల పాలసీలు కలిగిన వారికి ఇది బంపర్ ఆఫర్ లాంటి అవకాశమని చెప్పుకోవాలి.
ఈ ఊహాగానాలను బలం చేకూర్చేవిధంగా ఎల్ఐసీ గత కొంత కాలంగా పత్రికలు, ఇతర మాధ్యమాల్లో షేర్లు రిజర్వు చేస్తుందనే అర్థం వచ్చేట్టు ప్రకటనలు చేసింది. ఆ ప్రకటనల్లో పాలసీ హోల్డర్లు తమ పాన్ వివరాలను అప్ డేట్ చేయాలని కూడా కోరింది. దీనికి తోడు పాలసీ హోల్డర్లు ఏదైనా డిపాజిటరీ పార్టిసిపెంట్ వద్ద డీమ్యాట్ ఎకౌంట్ కలిగి ఉండాలని సూచించింది. రానున్న కొన్ని రోజుల్లో ఎల్ఐసీ సెబీ వద్ద డిఆర్ హెచ్ పి సమర్పించనున్నందున LIC ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ఆసక్తి మార్కెట్ వర్గాల్లో, పాలసీ హోల్డర్లలో, మదుపరుల్లో నెలకొంది. మెుత్తం ఎల్ఐసీ మార్కెట్ విలువలో 5 శాతం వాటాలను అమ్మాలని నిర్ధేసించుకుంది.
ఈక్విటీ మార్కెట్‌లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. వీటిని NSDL, CDSL నిర్వహిస్తుంటాయి. ఆధార్, పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రం వంటి వివరాలతో డీమ్యాట్ ఖాతాను తెరవొచ్చు. అప్పుడే మీరు ఐపీవోలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు.
కానీ.. దీనికి సంబంధించి ఎల్ఐసీ అధికారికంగా ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిపై కొన్ని వార్తా సంస్థలు సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు చర్చల స్థాయిలో ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు తాము ఎటువంటి కామెంట్లు చేయబోమని వారు పేర్కొన్నారు.
ఇవీ చదవండి…
BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి అదిరిపోయే ఆఫర్.. రూ.197 ప్లాన్‌తో 150 రోజుల వ్యాలిడిటీ
Market News: పీఎం గతిశక్తితో ఎక్కువ లాభపడనున్న ఆ సెక్టార్.. దేశంలో ఉపాధి కల్పనకూ ఊతం..