BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి అదిరిపోయే ఆఫర్.. రూ.197 ప్లాన్‌తో 150 రోజుల వ్యాలిడిటీ
BSNL Offer: ప్రస్తుతం టెలికం రంగంలో పోటీ తత్వం నెలకొంది. పలు టెలికం కంపెనీలు కస్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లను అందిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ..
BSNL Offer: ప్రస్తుతం టెలికం రంగంలో పోటీ తత్వం నెలకొంది. పలు టెలికం కంపెనీలు కస్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లను అందిస్తున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు యూజర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తుండగా, బీఎస్‌ఎన్‌ఎల్ కూడా దూసుకెళ్తోంది. ఇక ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ రూ.197 మాత్రమే. ఈ ప్యాక్‌లో 150 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. దీంతోపాటు అపరిమిత కాల్స్, రోజు ఉచిత ఎస్‌ఎంఎస్ (SMS)లు పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ప్లాన్ అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
అయితే డేటా, అపరిమిత కాల్స్‌పై మాత్రం పరిమితిఉంది. రీచార్జ్ చేసుకున్నప్పటికీ మొదటి రోజు నుంచి 18 రోజులు మాత్రమే 2GB హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఆ తర్వాత మిగతా రోజులకు డేటా స్పీడ్ 40 Kbpsకు పడిపోతుంది. ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రం వస్తుంటాయి. ఒక వేళ ఎవరికైనా కాల్స్ చేయాలనుకుంటే టాపప్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఉచిత మెసేజ్ ప్రయోజనాలు మాత్రం అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి: