5G Services: 5జీ సేవలతో విమానాలకు ప్రమాదం ఉంటుందా..? పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం
5G Services: టెలికాం రంగం (Telecom sector)లో 5G సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి...
5G Services: టెలికాం రంగం (Telecom sector)లో 5G సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దేశంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంఎన్‌టీఎల్ కంపెనీలకు 5జీ ట్రయల్స్ (5G Trials) నిర్వహించుకునేందుకు కేంద్ర సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా కంపెనీలు ట్రయల్స్‌ను వేగవంతం చేస్తున్నాయి. మరో వైపు దేశంలో 5జీ సేవలు ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది.
5జీ సేవలు ప్రవేశపెట్టడంపై అమెరికన్ ఏవియేషన్ సెక్టార్ ఆందోళన చెందుతోంది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమాన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. త్వరలో భారతదేశంలో 5G సర్వీసులు ప్రారంభించనున్నందున విమాన సర్వీసుల భద్రతపై పార్లమెంట్‌లో ఎంపీలు కేంద్ర ప్రభుత్వం వివరణ కోరారు. అయితే దేశంలో 5G ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి సమయంలో 5జీ సర్వీసుల వల్ల విమానాలకు ఏమైనా ప్రమాదమా..? దీనికి సంబంధించి రిపోర్టు ప్రభుత్వం వద్ద ఉందా అని ఎంపీలు ప్రశ్నించారు. ఇంటర్నేషల్ టెలి కమ్యూనికేషన్స్‌తో పాటు 5జీ కేటాయించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌తో ఎయిరోనాటికల్ కమ్యూనికేషన్స్‌కు ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది. ఇటీవల అమెరికాలో 5జీ సర్వీసులు ప్రారంభించగా, విమానయాన సంస్థలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ 5జీ సేవలు విమానాలకు ప్రమాదం ఉందంటూ ఫ్లైట్లను నిలిపివేశాయి.
ఇవి కూడా చదవండి: