AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Policy: రూ.10,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో మీ పిల్లలను లక్షాధికారులను చేయొచ్చు.. ఎలాగంటే.!

మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా.? తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌‌తో అధిక రాబడులను కోరుకుంటున్నారా.? అయితే అలాంటి ఓ పాలసీ..

LIC Policy: రూ.10,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో మీ పిల్లలను లక్షాధికారులను చేయొచ్చు.. ఎలాగంటే.!
Ravi Kiran
|

Updated on: Jul 24, 2021 | 2:08 PM

Share

మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా.? తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌‌తో అధిక రాబడులను కోరుకుంటున్నారా.? అయితే అలాంటి ఓ పాలసీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ వివిధ పాలసీలను తీసుకొచ్చిన విషయం విదితమే. వాటిల్లో ఒకటే ‘న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్’ పాలసీ. ఇందులో 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా మీ పిల్లలు 18 సంవత్సరాలు వయస్సుకు వచ్చేసరికి లక్షలు పొందవచ్చు. తద్వారా వారి విద్య, ఇతరత్రా వాటికి మీరు ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చు.

‘న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్’ పాలసీ మెచ్యూరిటీ 25 సంవత్సరాలు. ఇక మెచ్యూరిటీ మొత్తాన్ని దశలవారీగా పొందొచ్చు. ఈ పథకం కింద, ఎల్‌ఐసి ప్రాథమిక మొత్తంలో మొదటి 20 శాతం మీ పిల్లాడికి 18 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, మరో 20 శాతం 20 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, అలాగే ఇంకో 20 శాతం మొత్తాన్ని.. మీ పిల్లాడికి 22 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు చెల్లిస్తుంది. ఇక ఆఖరి 40 శాతం మొత్తాన్ని మీ పిల్లలకి 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చెల్లిస్తుంది. ఇది మాత్రమే కాదు, మెచ్యూరిటీ మొత్తంతో పాటు బోనస్ కూడా లభిస్తుంది.

పాలసీ గురించి మరిన్ని విషయాలు..

‘న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్’ పాలసీ తీసుకునేటప్పుడు మీ పిల్లల వయస్సు 0-12 సంవత్సరాల మధ్య ఉండాలి.

కనీసం రూ. 10,000 రూపాయల భరోసాతో పాలసీని తీసుకోవచ్చు, గరిష్ట మొత్తానికి అయితే పరిమితి లేదు.

ప్రీమియం మినహాయింపుకు సంబంధించిన ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఒకవేళ పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణించినట్లయితే, బీమా చేసిన మొత్తంతో పాటు అదనంగా రివర్షనరీ బోనస్, ఫైనల్ ఎడిషినల్ బోనస్ కూడా నామినీకి లభిస్తుంది.

పాలసీ తీసుకోవడానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్…

తల్లిదండ్రులు, పిల్లల ఆధార్ కార్డు

అడ్రెస్ ప్రూఫ్, పాన్ కార్డ్ ఫోటోకాపీ

పాలసీ తీసుకునే వ్యక్తి మెడికల్ హిస్టరీకి సంబంధించిన డాక్యుమెంట్స్

దరఖాస్తు కోసం, ఎల్‌ఐసీ శాఖ నుండి పథకానికి సంబంధించిన ఫారమ్‌ను తీసుకొని అవసరమైన పత్రాలు జత చేసి సమర్పించండి.

Disclaimer: ఈ వార్త కేవలం సేకరించిన సమాచారం ఆధారంగా ప్రచురితమైనది మాత్రం. వాటితో టివీ9 ఛానల్, టీవీ9 వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని మనవి.

Also Read:

రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!