AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI: క్రెడిట్‌ కార్డుతో యూపీఐ పేమెంట్స్‌ చేసుకునే అవకాశం.. ఎలా లింక్‌ చేసుకోవాలంటే.

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఊపందుకున్నాయి. ఇక డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ మధ్య పెరిగిన పోటీ కూడా వీటి ఉపయోగం పెరగడానికి కారణాలు చెప్పొచ్చు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ వ్యాలెట్స్‌లో...

UPI: క్రెడిట్‌ కార్డుతో యూపీఐ పేమెంట్స్‌ చేసుకునే అవకాశం.. ఎలా లింక్‌ చేసుకోవాలంటే.
Credit Card Upi
Narender Vaitla
|

Updated on: Apr 16, 2023 | 9:46 AM

Share

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఊపందుకున్నాయి. ఇక డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ మధ్య పెరిగిన పోటీ కూడా వీటి ఉపయోగం పెరగడానికి కారణాలు చెప్పొచ్చు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ వ్యాలెట్స్‌లో మార్పులు వస్తున్నాయి. ఇక తాజాగా డిజిటల్ పేమెంట్స్‌ను మరింత పెంచేందుకు గాను కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు డిజిటల్‌ వ్యాలెట్స్‌కు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్‌ చేసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా క్రెడిట్‌ కార్డులను సైతం లింక్‌ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు.

తాజాగా కొటక్ మహీంద్ర బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ సేవల సదుపాయం కల్పించనుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న తొలి బ్యాంకుగా నిలిచింది కొటక్‌ మహీంద్ర. కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. క్రెడిట్ కార్డు కలిగిన కస్టమర్లు రోజువారీ యూపీఐ సేవలు కార్డుని అనుసంధానం చేసుకోవచ్చు. కోటక్ మహీంద్ర రూపే క్రెడిడ్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. బీమ్, పేటీఎం, ఫోన్ పే, ప్రీఛార్జ్, పేజాప్‌తో సహా కొన్ని యూపీఐ యాప్‌లతో ఈ సేవలు పొందవచ్చు.

క్రెడిట్‌ కార్డులను డిజిటల్‌ వ్యాలెట్‌తో లింక్‌ చేసుకుంటే యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్‌ మొత్తం క్రెడిట్ కార్డు నుంచి కట్ అవుతాయి. ప్రస్తుతం ఈ సేవలు కోటక్‌కు పరిమితంకాగా త్వరలో ఇతర బ్యాంకులు సైతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. క్రెడిట్‌ కార్డును యాప్‌తో లింక్‌ చేసకోవాలంటే ముందుగా.. యాప్ ఓపెన్ చేసి లింక్డ్ బ్యాంక్ ఎక్కౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత యాడ్ ఎక్కౌంట్ క్లిక్ చేసి క్రెడిట్ కార్జు ఆప్షన్ క్లిక్ చేయాలి. క్రెడిట్ కార్డు ఎంచుకున్న తరువాత మొబైల్ నెబర్, క్రెడిట్ కార్డు చెల్లుబాటు, ఇతర వివరాలు ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్