Komaki CAT 2.0: వ్యాపారులకు అనువైన ఈవీ రిలీజ్ చేసిన కొమాకి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల మైలేజ్

ఇప్పటివరకూ మార్కెట్‌లో ఎక్కువగా వ్యక్తిగత అవసరాలకు వాడుకునే ఈవీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉండే ఈవీలు చాలా తక్కువగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కొమాకీ క్యాట్ 2.0 ఎన్ఎక్స్‌టీ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్‌ను విడుదల చేసింది. ఈ ఈవీ మోపెడ్ ధర రూ. 99,500 (ఎక్స్-షోరూమ్)గా రిలీజ్ చేసింది.

Komaki CAT 2.0: వ్యాపారులకు అనువైన ఈవీ రిలీజ్ చేసిన కొమాకి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల మైలేజ్
Komaki Cat 2.0
Follow us
Srinu

|

Updated on: Apr 03, 2024 | 8:15 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు అంతా ఈవీ వాహనాల వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ మార్కెట్‌లో ఎక్కువగా వ్యక్తిగత అవసరాలకు వాడుకునే ఈవీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉండే ఈవీలు చాలా తక్కువగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కొమాకీ క్యాట్ 2.0 ఎన్ఎక్స్‌టీ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్‌ను విడుదల చేసింది. ఈ ఈవీ మోపెడ్ ధర రూ. 99,500 (ఎక్స్-షోరూమ్)గా రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ 30లోపు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే రూ.5000 క్యాష్ బ్యాక్‌ను కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలో కొమాకీ క్యాట్ 2.0 స్కూటర్ ఫీచర్లతో పాటు ఇతర వివరాలను ఓ సారి తెలుసుకుందాం. 

కొమాకీ క్యాట్ 2.0 ఎన్ఎక్స్‌టీ స్కూటర్‌లో అనేది 42 ఏహెచ్ ఎల్ఐపీఓ4 బ్యాటరీను అమర్చారు. అందువల్ల ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 110 కి.మీ-140 కి.మీల మధ్య పరిధిని అందిస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ వ్యాపారులకు అనువుగా ఉండే సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఏకంగా గంటకు 79 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లడం ఈ స్కూటర్ ప్రత్యేకతలు. అలాగే డెలివరీ కార్యకలాపాలకు అనుగుణంగా 350 కిలోల వరకు లోడ్ సామర్థ్యంతో కన్వర్టిబుల్ సీటింగ్‌తో కూడిన ఐరన్ ఫ్రేమ్ అందరినీ ఆకట్టుకుంటుంది. క్యాట్ 2.0 ఎన్ఎక్స్‌టీ పోర్టబుల్ ఛార్జర్‌తో వస్తుంది. అలాగే కంపెనీ క్లెయిమ్ చేసిన ప్రకారం ఈ స్కూటర్‌ను చార్జ్ చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. 

కొమాకీ క్యాట్ 2.0 ఎన్ఎక్స్‌టీ ముందు ఎల్ఈడీ లైట్లు, బీఎల్‌డీసీ హబ్ మోటార్, పార్కింగ్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ, ఆరు హైడ్రాలిక్ రియర్ సస్పెన్షన్లతో సహా అనేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ దాని కన్వర్టిబుల్ డిజైన్ లోడర్‌గా అతుకులు లేకుండా పరివర్తనను అనుమతిస్తుంది. విభిన్న రవాణా అవసరాలను తీర్చడానికి అదనపు సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఫోల్డబుల్ బ్యాక్స్, అదనపు స్టోరేజ్ స్పేస్, సేఫ్టీ గార్డ్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ అప్‌డేట్లు, ప్రయాణంలో ఉన్నప్పుడు డివైజ్లను ఛార్జింగ్ చేయడానికి యూఎస్‌బీ పోర్ట్, ఇతర ఫీచర్లతో పాటు అదనపు ఫుట్రెస్ట్ ఈ ఈవీ మోపెడ్ అదనపు ప్రత్యేకతలుగా ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్