Gold Price Today: తగ్గేదేలే.. దూసుకుపోతున్న పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర 70 వేల మార్క్ దాటగా.. వెండి ధర 80 వేల మార్క్ దాటింది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రెండేళ్లుగా స్థిరంగా లేదు. గతేడాది ఇదే సమయానికి 60 వేలు దాటితే.. ఇప్పుడు రూ.70 వేల మార్క్ క్రాస్ చేసింది.

Gold Price Today: తగ్గేదేలే.. దూసుకుపోతున్న పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 04, 2024 | 6:26 AM

బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర 70 వేల మార్క్ దాటగా.. వెండి ధర 80 వేల మార్క్ దాటింది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రెండేళ్లుగా స్థిరంగా లేదు. గతేడాది ఇదే సమయానికి 60 వేలు దాటితే.. ఇప్పుడు రూ.70 వేల మార్క్ క్రాస్ చేసింది. వాస్తవానికి 2018లో 30వేలున్న పది గ్రాముల పసిడి ధర.. ఆరేళ్లు గడిచేసరికి రెండింతలకు పైగా పెరిగింది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నారు.. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే.. పెళ్లిళ్ల సీజన్ నాటికి బంగారం, వెండి రేట్లు ఎలా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత రెండు మూడు వారాల్లోనే ధరలు దాదాపు 3వేలకు పైగా పెరిగాయి. వాస్తవానికి.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ రేట్లల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారంపై రూ.10, వెండి కిలోపై రూ.100 మేర ధర పెరిగింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.70,030 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.64,110, 24 క్యారెట్లు రూ.69,880, చెన్నైలో 22 క్యారెట్లు రూ.65,010, 24క్యారెట్లు రూ.70,920, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.64,110, 24క్యారెట్లు రూ.69,880, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.64,110, 24క్యారెట్ల ధర రూ.69,880 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.81,100 లుగా ఉంది. ముంబైలో రూ.81,100, బెంగళూరులో రూ.78,350, చెన్నైలో రూ.84,100, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో రూ.84,100గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..