AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huawei Luxeed S7: ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌.. ఏకంగా డెలివరీలు కూడా ప్రారంభం..

మరో చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ హువావే కూడా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. చెరీ అనే కంపెనీతో కలిసి ఓ కొత్త ఎలక్ట్రిక్‌ సెడాన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. లక్సీడ్‌ ఎస్‌7 పేరుతో ఈ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారును ఆవిష్కరించింది. ఇప్పటికే ప్రీ బుక్‌ చేసుకున్న వారికి డెలివరీలు సైతం ప్రారంభించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Huawei Luxeed S7: ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌.. ఏకంగా డెలివరీలు కూడా ప్రారంభం..
Huawei Luxeed S7 Electric Sedan
Madhu
|

Updated on: Apr 03, 2024 | 12:13 PM

Share

స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు ఆటోమొబైల్‌ పరిశ్రమపై ఫోకస్‌ పెట్టాయి. తమ పరిధిని విస్తరించుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ ట్రెండ్‌ చైనాలో బాగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ షావోమీ ఇటీవల ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్లో అడుగుపెట్టింది. షావోమీ ఎస్‌యూ7 పేరిట ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారును మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఆ కంపెనీ ఏకంగా ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా స్థానంపై కన్నేసి.. నంబర్‌ వన్‌ తన లక్ష్యమని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో మరో చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ హువావే కూడా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. చెరీ అనే కంపెనీతో కలిసి ఓ కొత్త ఎలక్ట్రిక్‌ సెడాన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. లక్సీడ్‌ ఎస్‌7 పేరుతో ఈ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారును ఆవిష్కరించింది. ఇప్పటికే ప్రీ బుక్‌ చేసుకున్న వారికి డెలివరీలు సైతం ప్రారంభించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి ఎప్పుడో దీని లాంచ్‌ ఉంటుందని ప్రకటించినా ఆ కంపెనీలో సెమీకండక్టర్ల కొరత కారణంగా దీని ఉత్పత్తి ఆలస్యమైందని.. ఇప్పుడు అన్నీ సమకూరడంతో ఉత్పత్తితో పాటు డెలివరీలు కూడా చేస్తు‍న్నట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

మొట్టమొదటి కారు..

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ హువావే నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్‌ కారు ఈ లక్సీడ్‌ ఎస్‌7 సెడాన్‌. ఈ కారు ప్రకటించగానే దాదాపు 20వేల ఆర్డర్లు వచ్చినట్లు ఆ కంపెనీ గత నవంబర్‌లో పేర్కొంది. 2023, నవంబర్‌ 28వ తేదీన తన ఆర్డర్‌వివరాలను కంపెనీ వివరించింది. కంపెనీలో సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తి పనులు నిలిచాయని.. కానీ ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం కావడంతో ఉత్పత్తి వేగం పుంజుకుందని పేర్కొంది. ఆర్డర్‌ అందుకున్న 4 నుంచి 5 నెలల లోపు కంపెనీ ఈ లక్సీడ్‌ ఎస్‌7 కార్ల డెలివరీలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏప్రిల్‌ చివరి నాటికి ఈ ఉత్పత్తి, డెలివరీల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని హువావే తెలిపింది.

అంతా సిద్ధం..

ఈ కారు లాంచింగ్‌ సందర్భంగా హువావే స్మార్ట్‌ కార్‌ సొల్యూషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చైర్మన్‌ రిచర్డ్‌ యు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం విబోలో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. దానిలో ఈ కారు గురించిన సమాచారం ఉంది. పెద్ద సంఖ్యలో ఈ కార్ల ఉత్పత్తి జరుగుతోందని.. ప్రీ బుక్‌ చేసుకున్న కస్టమర్లతో పాటు ప్రస్తుతం బుక్‌ చేసుకుంటున్న వారికి కూడా డెలివరీలు అందిస్తామని కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ధర ఎంతంతే..

హువావే సంస్థ గతేడాది చెప్పుకోదగ్గ లాభాలను ఆర్జించింది. దీంతో అది తన కార్ల వెంచర్‌ను వేగంగా అభివృద్ధి చేసేందుకు దోహదపడింది. కాగా ఈ హువావే లక్సీడ్‌ ఎస్‌7 ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారు ధర 34,600డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో ఇది రూ. 28.27లక్షల వరకూ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..