AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing: మార్చి 31లోపు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదా..? ఆ సమస్యలు తప్పవంతే..!

పన్ను చెల్లింపుదారులు 50 శాతం వరకు పెనాల్టీని చెల్లించడం ద్వారా ఈ లోపాలను సరిదిద్దడానికి ఇది చివరి అవకాశంగా ఉంది. అయితే ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ వారిని ఏ రోజునైనా పట్టుకుని 200 శాతం వరకు జరిమానా విధించవచ్చు. ఐటీఆర్-యూ గడువు ముగిసిన తర్వాత తదుపరి సవరణలు చేసే అవకాశం పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ITR Filing: మార్చి 31లోపు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదా..? ఆ సమస్యలు తప్పవంతే..!
Income Tax Notice
Nikhil
|

Updated on: Apr 03, 2024 | 8:00 PM

Share

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్‌డేట్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ లేదా ఐటీఆర్-యూ ఫైల్ చేయడానికి గడువు మార్చి 31, 2024తో ముగిసింది. అయితే ఈ గడువులోపు గతంలో ఫైల్ చేసిన ఐటీఆర్‌లో ఏదైనా లోపం ఉంటే లేదా ఏదైనా తప్పుగా నివేదించబడిన ఆదాయం లేదా ఆదాయాన్ని తక్కువగా నివేదిస్తే ఇప్పుడు దానిని ఐటీఆర్-యూ ఫైల్ చేయడం ద్వారా పరిష్కరించలేరు. పన్ను చెల్లింపుదారులు 50 శాతం వరకు పెనాల్టీని చెల్లించడం ద్వారా ఈ లోపాలను సరిదిద్దడానికి ఇది చివరి అవకాశంగా ఉంది. అయితే ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ వారిని ఏ రోజునైనా పట్టుకుని 200 శాతం వరకు జరిమానా విధించవచ్చు. ఐటీఆర్-యూ గడువు ముగిసిన తర్వాత తదుపరి సవరణలు చేసే అవకాశం పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీఆర్-యూ చెల్లింపు విషయంలో మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఐటీఆర్-యూ దాఖలు చేయకపోతే జైలు తప్పదా?

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయని కారణంగా ఒక మహిళకు జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవలి కేసులో తీర్పునిచ్చింది . పన్ను చట్టాల ప్రకారం రిటర్న్ దాఖలు చేయడంలో ఉద్దేశపూర్వకంగా విఫలమైనందుకు ఆదాయాన్ని దాచిపెట్టినందుకు, తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఒక వ్యక్తికి జైలు శిక్ష విధించవచ్చు. కాబట్టి ఐటీఆర్-యూ ఫైల్ చేయడం తప్పనిసరి కానందున తన ఐటీఆర్‌ను ఫైల్ చేసినా కానీ ఐటీఆర్-యూని ఫైల్ చేయని వ్యక్తిని జైలులో పెట్టలేరు. అయితే ఏదైనా తక్కువగా నివేదించబడిన ఆదాయం కనుగొనబడితే, పన్ను అధికారులు దానిని దాచిపెట్టినందుకు జైలు శిక్షను కోరే అవకాశం మాత్రం ఉంది. 

ఐటీఆర్-యూ, ఐటీఆర్ రెండూ డిక్లేర్డ్ ఆదాయాలను సవరించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. అయితే వ్యత్యాసం పన్ను ఫెనాల్టీ, ఫైల్ చేయడానికి సమయ పరిమితి అంశాల్లో అందుబాటులో ఉంది. ఐటీఆర్-యూని నిర్దిష్ట నిర్దిష్ట కేసుల్లో మాత్రమే ఫైల్ చేయవచ్చు. అలాగే ఎగవేసిన పన్నులో 50 శాతం వరకు జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే ఫైల్ చేసే అవకాశం ఉంది. సవరించిన ఐటీఆర్ దానిని ఫైల్ చేసే సమయంలో చెల్లించాల్సిన జరిమానాకు పన్ను విధించరు. అలాగే సవరించిన ఐటీఆర్‌ను అసలు ఐటీఆర్ ఫైల్ చేసిన సంవత్సరం తర్వాత తొమ్మిది నెలల వరకు ఫైల్ చేయవచ్చు. ఐటీఆర్-యూ కోసం గడువు ముగిసిన తర్వాత కూడా ఐటీఆర్-యూఫైల్ చేయగలిగే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

ఐటీఆర్-యూ ఫైల్ చేయడానికి అర్హత ఉన్నప్పటికీ వ్యక్తులు దానిని ఫైల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ పరిస్థితుల్లో చెల్లుబాటు అయ్యే కారణంతో సెక్షన్ 119(2)(బి) కింద ఒక వ్యక్తి ఐటీఆర్-యూని క్షమాపణ ఫారమ్‌తో పాటు ఫైల్ చేయవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. కాబట్టి ఐటీఆర్-యూ ఫైల్ చేసే సమయంలో తప్పనిసరిగా క్షమాపణ దరఖాస్తు అభ్యర్థన ఇవ్వాలి. ఐటిఆర్-యూను ఫైల్ చేయడానికి గడువు ముగిసిన సందర్భాల్లో ఐటీఆర్-యూను కండోనేషన్ ఫారమ్‌తో పాటు ఫైల్ చేయకపోతే సంబంధిత అధికారి సెక్షన్ 148 కింద నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. దీంతో నోటీసు జారీ చేసిన తర్వాత కేసు పరిశీలనలోకి వస్తుంది. అలాగే భిన్నంగా పరిగణిస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..