AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old Bike Into Royal Enfield: రూ.20 వేల ఖర్చుతో పాత బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మార్పు.. తెలంగాణ యువకుడి అద్భుత ఆవిష్కరణ

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సందీప్ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తన పాత బైక్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ స్ఫూర్తితో రైడ్‌గా మార్చి స్థానికులను ఆకట్టుకున్నాడు. తనకున్న ఆర్థిక పరిస్థితికి కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను కొనుగోలు చేయలేకపోయినా తన దగ్గర ఉన్న బైక్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లా మార్చేశాడు. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ విడి బాగాలను తన బైక్‌కు సెట్ చేసిన అసలుసిసలైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లా సెట్ చేశాడు. సందీప్ తయారు చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను బయటకు తీసుకెళ్తే అంతా కచ్చితమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లా చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Old Bike Into Royal Enfield: రూ.20 వేల ఖర్చుతో పాత బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మార్పు.. తెలంగాణ యువకుడి అద్భుత ఆవిష్కరణ
Changing An Old Bike Into A Royal Enfield
Nikhil
|

Updated on: Apr 03, 2024 | 7:20 PM

Share

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సందీప్ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తన పాత బైక్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ స్ఫూర్తితో రైడ్‌గా మార్చి స్థానికులను ఆకట్టుకున్నాడు. తనకున్న ఆర్థిక పరిస్థితికి కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను కొనుగోలు చేయలేకపోయినా తన దగ్గర ఉన్న బైక్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లా మార్చేశాడు. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ విడి బాగాలను తన బైక్‌కు సెట్ చేసిన అసలుసిసలైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లా సెట్ చేశాడు. సందీప్ తయారు చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను బయటకు తీసుకెళ్తే అంతా కచ్చితమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లా చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో సందీప్ తయారు చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సందీప్ తన పాత బైక్‌ను అప్డేట్ చేయడానికి విడిభాగాల కోసం రూ.20,000 మాత్రమే ఖర్చు చేశాడు. ఈ బైక్ రైడింగ్ నాకు నిజమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ పొందే ఆనందాన్ని ఇస్తుందని సందీప్ చెబుతున్నారు. అలాగే ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ కస్టమ్ బైక్ డిజైనర్ కథనం అందరి దృష్టిని ఆకర్షించింది. అతను రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను కస్టమైజ్ చేసే ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాడు. ఈ 16 ఏళ్ల పునరుద్ధరణ వర్క్‌షాప్ వెనుక సూత్రధారి బాబ్జీ సింగ్. మీరు మీ ఎన్‌ఫీల్డ్‌కి పాతకాలపు మేక్ఓవర్ ఇవ్వాలని చూస్తుంటే మంచి ఎంపిక

అలాగే తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామానికి చెందిన పాప చంద్ర అనే స్థానిక వ్యాపారి తన పాత సైకిల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. అతనికి ఆలోచన వచ్చిన వెంటనే, అతను చర్య తీసుకున్నాడు. తన సైకిల్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు రూ.16,000 పెట్టుబడి పెట్టాడు. కొంతకాలం క్రితం తెలంగాణలోని ముంజంపల్లి గ్రామంలో నివసించే కాసం అఖిల్ రెడ్డి తన తండ్రి కోసం పాత మోటార్‌సైకిల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. రెడ్డి తన తండ్రి ఎలాంటి ఇబ్బంది పడకుండా పొలానికి చేరుకునేలా పాత బైక్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా అప్‌గ్రేడ్ చేశాడు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కార్ ఫిక్సింగ్ నేర్చుకున్నాడు. ఐదు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు వెళ్లేలా బైక్‌ను మార్చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..