Kinetic E Luna: లూనాతో మామూలుగా ఉండదు మరి… ఈవీ స్కూటర్స్‌లో దుమ్మురేపుతున్న లూనా ఫీచర్ల గురించి తెలుసుకోవాల్సిందే..!

కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫిబ్రవరి 7, 2024న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ-లూనా కూడా 1972లో భారతదేశంలో ప్రవేశపెట్టిన ఒరిజినల్ లూనాలా అద్భుతంగా ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కైనెటిక్ గ్రీన్ సీఈఓ సులజ్జా ఫిరోడియా మోత్వాని ప్రకారం ఈ-లూనా ఇతర ఎలక్ట్రిక్ వాహనాల్లా టైర్ 1 మార్కెట్ల కోసం రూపొందించలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా సాధారణ పట్టణాల్లో కూడా లూనా తన మార్క్‌ను చూపించాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు.

Kinetic E Luna: లూనాతో మామూలుగా ఉండదు మరి… ఈవీ స్కూటర్స్‌లో దుమ్మురేపుతున్న లూనా ఫీచర్ల గురించి తెలుసుకోవాల్సిందే..!
Kinetic E Luna
Follow us

|

Updated on: Feb 10, 2024 | 9:00 AM

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుంది. భారతదేశంలో కూడా ఈవీ వాహనాల అమ్మకాలు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాయి. దీంతో అన్ని కంపెనీలు భారతమార్కెట్‌లో కూడా సరికొత్త ఈవీ స్కూటర్‌లను లాంచ్ చేస్తున్నాయి. కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫిబ్రవరి 7, 2024న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ-లూనా కూడా 1972లో భారతదేశంలో ప్రవేశపెట్టిన ఒరిజినల్ లూనాలా అద్భుతంగా ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కైనెటిక్ గ్రీన్ సీఈఓ సులజ్జా ఫిరోడియా మోత్వాని ప్రకారం ఈ-లూనా ఇతర ఎలక్ట్రిక్ వాహనాల్లా టైర్ 1 మార్కెట్ల కోసం రూపొందించలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా సాధారణ పట్టణాల్లో కూడా లూనా తన మార్క్‌ను చూపించాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. అనుక్నట్లే రిలీజ్ చేసిన సమయం నుంచి లూనాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-లూనా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1972లో లూనా భారతదేశంలో కైనెటిక్ ఎనర్జీ ద్వారా 50 సీసీ మోపెడ్‌గా పరిచయం చేశారు. దీని ఉత్పత్తి 2000 నుంచి నిలిపివేశారు. అయితే ఇది అందుబాటులో ఉన్న సమయంలో  దాని సరసమైన ధర మరియు క్రమబద్ధమైన డిజైన్ కారణంగా చాలా ప్రజాదరణ పొందింది. ఆ సమయంలో “చల్ మేరీ లూనా” అనే పదం దాని శక్తివంతమైన మార్కెటింగ్ కారణంగా భారతీయుల్లో చాలా ప్రజాదరణ పొందింది. ఆ సమయంలో ఆపరేట్ చేయడం చాలా సులభం కాబట్టి దీనికి గేర్లు అవసరం లేదని, తేలికైనది, సహేతుకమైన ధరగా ఉంది. అయినప్పటికీ అధిక-పనితీరు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం వల్ల కంపెనీ వాటిని ఉత్పత్తి చేయడాన్ని ఆపేయాల్సి వచ్చింది.  

ఈవీ వెర్షన్‌లో రీ ఎంట్రీ

కైనెటిక్‌కు సంబంధించిన సోదరి సంస్థ కైనెటిక్ గ్రీన్ లూనాకు సంబంధించిన ఎలక్ట్రిక్ వేరియంట్ అయిన ఈ-లూనాను అనేక డిజైన్‌లు, ఇతర మెరుగుదలతో ఇతర ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోటీగా ఉంచడానికి పరిచయం చేసింది. కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా సాంప్రదాయ మోపెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని పోలిన మొత్తం డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఇది మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్‌ల నుంచి వేరు చేయడానికి కొన్ని విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంది. కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ముందు భాగంలో చతురస్రాకారపు ఎల్ఈడీ లైట్లు అమర్చి ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విశిష్టతను, కాంపాక్ట్‌నెస్‌ని పెంచుతుంది. చిన్న ఎల్ఈడీ మెరుపుతో కూడా, అధిక-ఫోకల్ హెడ్‌లైట్ రాత్రి సమయంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మల్బరీ ఎరుపు, ఓషన్ బ్లూ, పెర్ల్ పసుపు, మెరిసే ఆకుపచ్చ, నైట్ స్టార్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా రెండు విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందిల కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ఎక్స్1 రూ.69,990 గా ఉంది. , కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ఎక్స్ 2 రూ.74,990గా ఉంది. ఇవి కైనెటిక్ గ్రీన్ వేరియంట్‌లకు సంబంధించిన పరిచయ ధరలు మాత్రమే. తుది ధర కాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దాని తుది ధర చాలా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా గంటకు 50 కిలో మీటర్ల దూరంతో దూసుకుపోతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 110 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా దాని 150 కిలోల పేలోడ్ సామర్థ్యం కారణంగా గణనీయమైన భారాన్ని మోయగలదు. అలాగే ఈ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఈ స్కూటర్‌లో గ్రాబ్ రైల్, సేఫ్టీ లాక్, సారీ గార్డ్, సైడ్ స్టాండ్ సెన్సార్, రగ్గడ్ స్టీల్ చట్రం వంటి అదనపు భద్రతా పరికరాలు ఉన్నాయి. ఫ్రంట్ లెగ్ గార్డ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, బ్యాగ్ హుక్, విశాలమైన క్యారీయింగ్ ఏరియా వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..