AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office scheme: మీ డబ్బు రెట్టింపు అయ్యే పోస్టాఫీస్ స్కీమ్ ఇదే! ఒకసారి లుక్కేయండి!

సాధారణంగా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అంటే డబ్బు దాచుకోవడానికే అనుకుంటారు చాలామంది. అయితే కొన్ని పోస్టాఫీస్ స్కీమ్ లు ఇన్వెస్ట్ మెంట్స్ తరహాలో రెండు రెట్ల రిటర్న్స్ ఇస్తున్నాయి. అలాంటి ఒక బెస్ట్ స్కీమ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Post Office scheme: మీ డబ్బు రెట్టింపు అయ్యే పోస్టాఫీస్ స్కీమ్ ఇదే! ఒకసారి లుక్కేయండి!
Post Office Scheme (2)
Nikhil
|

Updated on: Oct 01, 2025 | 3:14 PM

Share

సేవింగ్స్ అకౌంట్ లో డబ్బుని దాచుకునే రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్ మెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రభుత్వ పథకాలు కూడా ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్ ను అందిస్తున్నాయి. ముఖ్యంగా పోస్టాఫీస్ లో సురక్షితంగా పెట్టుబడి పెట్టేందుకు ఒక బెస్ట్ స్కీమ్ ఉంది అదేంటంటే..

కిసాన్ వికాస్ పత్ర యోజన

పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర యోజన అనే స్కీమ్ చాలామందికి తెలిసి ఉండదు. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే మీ డబ్బుని రెట్టింపు చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్స్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ స్కీమ్. ఇందులో ఒకేసారి మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. అలా చేసిన మొత్తం కొంత కాలానికి వడ్డితో కలిపి డబుల్ అయ్యి మన చేతికొస్తుంది.

పదేళ్లలో..

కిసాన్ వికాస్ పత్ర యోజన స్కీమ్ లో పెట్టుబడిదారులకు స్థిరమైన వడ్డీ అందుతుంది. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టిన మొత్తం.. సుమారు 115 నెలల్లో అంటే సుమారు  9.5 సంవత్సరాల కాలంలో రెట్టింపు అవుతుంది. అంటే మీరు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే..  సుమారు పదేళ్ల తర్వాత మీ డబ్బు రెట్టింపు అయ్యి చేతికి రూ.10 లక్షలు వస్తాయన్న మాట. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్ లో ఉండే రిస్క్ ఈ పెట్టబడి పథకంలో ఉండదు. ఇందులో రూ. 1000 నుంచి పొదుపు మొదలుపెట్టొచ్చు. అయితే ఇది నెలవారీ పథకం కాదు. ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

పెట్టుబడి ఎలా

వయసు 18 ఏళ్లు దాటిన వాళ్లు ఎవరైనా కిసాన్ వికాస్ పత్ర యోజనలో ఇన్వెస్ట్ చేయొచ్చు.  మీ దగ్గర పాస్‌పోర్ట్ సైజు ఫోటో, గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. దగ్గర్రలోని పోస్ట్ ఆఫీసులో లేదా ఆన్‌లైన్ ద్వారా స్కీమ్ లో జాయిన్ అవ్వొచ్చు. దీనికి సంబంధించి మీకొక సర్టిఫికేట్ ఇస్తారు. మీ స్కీమ్ గడువు ముగిసిన తర్వాత, మొత్తం నగదు, వడ్డీ రెండూ మీ ఖాతాకు తిరిగి జమ అవుతాయి.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌