AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Planning: మీరు నిజంగా రిచ్ అవ్వాలనుకుంటే ఈ అలవాట్లు మానుకోవాలి!

ఎన్నో ఏళ్ల నుంచీ కష్టపడుతున్నా.. ఏడాదికో, రెండేళ్లకో ఒకసారి జీతం పెరుగుతున్నా నెలాఖరికి ఇబ్బంది పడాల్సి రావడం, పెద్ద మొత్తంలో సేవింగ్స్ లేకపోవడం వంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది. దీనికి గల కారణం ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఉండే లోపాలే. వాటిని సరిచేసుకుంటే కొద్ది కాలంలోనే అనుకున్న గోల్స్ రీచ్ అవ్వొచ్చు.

Financial Planning: మీరు నిజంగా రిచ్ అవ్వాలనుకుంటే ఈ అలవాట్లు మానుకోవాలి!
Financial Planing
Nikhil
|

Updated on: Oct 01, 2025 | 4:15 PM

Share

ఆర్ధికంగా ఎదగడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉన్నచోటే ఉంటున్నారా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోవాలంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్లు. డబ్బు విషయంలో పైకి ఎదగకుండా చేసే అలవాట్లేంటంటే..

లోన్స్ భారం

ఫైనాన్షియల్‌గా ఎదగలేకపోవడానికి మొదటికారణం.. లోన్స్‌కు అలవాటు పడడం అనేది నిపుణుల అభిప్రాయం. సంపాదన ఉందన్న నమ్మకంతో లోన్ తీసుకుని వస్తువులను కొంటుంటారు చాలామంది. లోన్ తీసుకోవడమంటే.. రాబోయే సంపాదనను ఇప్పుడే ఖర్చు పెట్టడం అని అర్థం. కాబట్టి సంపాదనలో సేవింగ్స్ కనిపించాలంటే ముందస్తుగా ఖర్చు పెట్టడం మానుకోవాలి. ఉన్నంతలో బడ్జెట్ వేసుకుని జీవించాలి. మీ ఫైనాన్షియల్ గోల్ రీచ్ అయ్యే వరకూ లోన్స్ జోలికి పోకపోవడమే మంచిది.

ఖర్చులో నిలకడ

ఆర్ధికంగా ఎదగలేకపోవడానికి మరో కారణం సరైన విధంగా బడ్జెట్ ప్లాన్ చేసుకోకపోవడం. వచ్చే ఆదాయం, ఖర్చులను బట్టి ఒక బడ్జెట్ రూపొందించుకుని దానికి కట్టుబడి ఉంటే పొదుపు సాధ్యం అవుతుంది. ఖర్చులో నియంత్రణ లేనంత వరకూ ఆస్తుల సంపాదన సాధ్యం కాదు.

పెట్టుబడి ముఖ్యం

సంపాదనలో కనీసం పది లేదా ఇరవై శాతమైనా పొదుపు లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకపోతే దీర్ఘకాలంలో నష్టపోతారు. వచ్చే ఆదాయంపైనే ఎప్పటికీ ఆధారపడకుండా మరో ప్లానింగ్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా బంగారం, ఇళ్ల స్థలాల కొనుగోలు వంటివి చేయాలి.

కొత్త స్కిల్స్

డబ్బుని పెట్టుబడిగా పెట్టడం ఎంత ముఖ్యమో స్కిల్స్‌పై సమయాన్ని పెట్టుబడి పెట్టడం కూడా అంతే ముఖ్యం. డబ్బుని డబ్బుతో సృష్టించొచ్చు లేదంటే స్కిల్స్‌ను డబ్బు రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ రెండు విషయాలపై ఫోకస్ పెట్టాలి.

ఫ్యూచర్‌‌పై గురి

ఫ్యూచర్ గురించిన ఆలోచన అంత మంచిది కాదు అంటుంటారు. కానీ, డబ్బు విషయంలో ఇదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. డబ్బుని ఎప్పుడూ ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించాలి. అప్పుడే ఆర్ధికంగా ఎదగడం సాధ్యమవుతుంది.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.