Stock Market: ఫెడ్ భయాలతో నష్టపోయిన సూచీలు.. నష్టాల్లో మెటల్, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటి స్టాక్స్..
Market Closing: భారత మార్కెట్లను సైతం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల భయాలు అలుముకున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా కోల్పోయింది.
Market Closing: భారత మార్కెట్లను సైతం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల భయాలు అలుముకున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 50 సూచీ 15,700 స్థాయికి దిగువన స్థిరపడటంతో బుధవారం నాల్గవ వరుస సెషన్‌లో మార్కెట్లు నెగటివ్ గా ముగిశాయి. అధిక అస్థిరత మధ్య, మార్కెట్ ముగింపులో బెంచ్‌మార్క్‌లు ప్రధానంగా మెటల్, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటి స్టాక్‌ల వల్ల మార్కెట్లు పడిపోయాయి. ఉదయం మార్కెట్ల ఆరంభంలో బలం కనిపించినప్పటికీ.. మధ్యాహ్నం ట్రేడింగ్ సెషన్ లో అమ్మకాల ఒత్తిడి సూచీలను దిగువకు లాగింది.
మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఈ సెన్సెక్స్ 152 పాయింట్లు లేదా 0.29 శాతం క్షీణించి 52,541 వద్ద స్థిరపడింది. నిఫ్టీ- 50 దాదాపు 40 పాయింట్లు లేదా 0.25 శాతం క్షీణించి 15,692 వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో మిడ్ క్యాప్ సూచీ 0.35 శాతం లాభపడింది. స్మాల్ క్యాప్ సూచీ ముగింపులో 0.6 శాతం మేర పెరిగింది. నిఫ్టీలోని 50 స్క్రిప్‌లలో 26 లాభపడగా, మిగిలిన 24 మార్కెట్ ముగింపులో క్షీణించాయి. మార్కెట్ ముగిసే సమయానికి బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్‌గా 4 శాతం, టాటా మోటార్స్ 2 శాతానికి పైగా లాభపడగా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీ షేర్లు 2 శాతం చొప్పున పెరిగాయి.
మరో పక్క మార్కెట్ ముగిసే సమయానికి ప్రభుత్వ రంగ కంపెనీలైన ONGC 2.5 శాతం, NTPC 2 శాతం క్షీణించి టాప్ లూజర్‌లుగా నిలిచాయి. మెజారిటీ సెక్టోరల్ ఇండెక్స్‌లు నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ మెటల్ 0.7 శాతానికి పైగా క్షీణించింది. నిఫ్టీ ఐటీ, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఒక్కొక్కటి దాదాపు 0.5 శాతం మేర క్షీణించాయి. ఇదే క్రమంలో.. నిఫ్టీ ఆటో అండ్ నిఫ్టీ ఫైనాన్స్ మాత్రం లాభపడ్డాయి.