AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holiday: విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..

School Holiday: పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లను వెంటనే చెల్లించాలని, దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ పెద్ద సమస్య నెలకొందని, వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం అవసరమని, అలాగే చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలవారని, వారి..

School Holiday: విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..
Subhash Goud
|

Updated on: Jul 22, 2025 | 3:28 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, పండుగలు, విద్యార్థి ఆందోళనల కారణంగా పాఠశాలలు, కాలేజీలకు వరుస సెలవులు వస్తున్నాయి. గత వారం శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల సెలవుల తర్వాత, ఇప్పుడు బుధవారం (జూలై 23)న కూడా విద్యాసంస్థలు బంద్‌ కానున్నాయి. దీంతో విద్యార్థులకు మరో సెలవు లభిస్తుంది. అయితే విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేస్తున్న నిరసన కారణంగా పాఠశాలలు మూసివేయనున్నారు.

గత వారం శనివారం భారీ వర్షాల కారణంగా పాఠశాలలు మూసివేశారు. ఆదివారం సెలవే. సోమవారం బోనాల పండుగ కారణంగా సెలవు. మంగళవారం తరువాత ఇప్పుడు బుధవారం కూడా సెలవు వస్తంది. దీంతో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Toll Tax Free: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. వీరికి టోల్‌ ట్యాక్స్‌ ఉండదు!

ఇవి కూడా చదవండి

విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ (AISF), ఎస్‌ఎఫ్‌ఐ (SFI), పీడీఎస్‌యూ (PDSU), ఏఐవైఎఫ్ (AIYF) కలసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో విద్యాసంస్థలను మూసివేయనున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి.

ప్రధాన డిమాండ్లు ఏంటి?

ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, దీనిపై తక్షణమే నియంత్రణ చట్టం తీసుకురావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయుల కొరతను సైతం తీర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడం కష్టమవుతోంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, MEO, DEO పోస్టులు వెంటనే భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లను వెంటనే చెల్లించాలని, దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ పెద్ద సమస్య నెలకొందని, వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం అవసరమని, అలాగే చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలవారని, వారి కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలల్లో కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యా సంస్థల బంద్‌ ను విజయవంతం చేయడంలో తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Auto News: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా? ఈ ట్రిక్‌తో పది నిమిషాల్లోనే మైలేజీ పెంచుకోవచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి