Viral Video: కొండ చిలువ చెట్టు ఎక్కే విధానం ఎప్పుడైనా చూశారా? వీడియో వైరల్!
Viral Video: కొండచిలువలు చెట్టు ఎక్కే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. అవి కండరాల బలం, కన్సర్టినా లాంటి కదలికల కలయికను ఉపయోగించి పైకి ఎగురుతాయి. అవి తమ బలమైన కండరాలు, పొలుసులతో చెట్టును పట్టుకుంటాయి తరువాత పైకి కదలడానికి నెట్టివేస్తాయి. ఎక్కడానికి..

Viral Video: ఏదైనా వీడియో ట్రెండింగ్ కావాలంటే అది సోషల్ మీడియానే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాములు, జంతువులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలోనే కనిపిస్తుంది. చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఇక వైరల్ వీడియోలకు కొదవే లేదు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింత విచిత్రం కనిపించిన అది సోషల్ మీడియాలో దర్శమిచేస్తుంది. అయితే ఇక్కడ ఓ పాము చెట్టు ఎక్కడం తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఏం తెలివిరా నాయానా..! ఇలాంటి దొంగతనం మీరు ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్
నిత్యం మనం నెట్టింట్లో పాముల వీడియోలు చాలానే చూస్తుంటాం.. రకరకాల పాములు సోషల్ మీడియా ద్వారా చూస్తుంటాం.. అన్నింటికన్నా పెద్దది భయంకరమైనది కొండచిలువే అని అందరికి తెలిసిందే. పెద్ద పెద్ద జంతువులను సైతం సులభంగా తినెయగల సత్తా ఉంటుంది. అయితే కొండచిలువ ఒక జంతువుని గానీ, మనిషిని గానీ తిన్నట్లయితే దాన్ని అరిగించుకునేందుకు చెట్టుకు చుట్టుకుని అరిగించుకుంటుందని చెబుతుంటారు. అయితే ఇక్కడ కొండచిలువ ఎవ్వరిని తినలేదు కానీ చెట్టెక్కుతూ కనిపించింది. ఈ పాము చెట్టును చుట్టుకుంటూ ఎలా ఎక్కుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు.
ఈ చెట్టు ఎక్కుతున్న పాము వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. మాములుగా పాములు ముందుకు సాగుతూ చెట్లను ఎక్కుతాయి. అయితే కొండచిలువ మాత్రం చెట్టును చుట్టుకుంటు ఎక్కుతుంది. ఈ వీడియో చూడటానికి భయమేసినా ఆ పాము చెట్టు ఎక్కినా తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
కొండచిలువలు చెట్టు ఎక్కే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. అవి కండరాల బలం, కన్సర్టినా లాంటి కదలికల కలయికను ఉపయోగించి పైకి ఎగురుతాయి. అవి తమ బలమైన కండరాలు, పొలుసులతో చెట్టును పట్టుకుంటాయి తరువాత పైకి కదలడానికి నెట్టివేస్తాయి. ఎక్కడానికి ఈ ప్రక్రియను పునరావృతం చేస్తాయి. కొండచిలువలు బలమైన కండరాలు, పొలుసులను కలిగి ఉండటం వల్ల నిలువు ఉపరితలాలను ఎక్కడానికి అవసరమైన పట్టు ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




