AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జాలర్లు వేసిన వల బలంగా అనిపించింది – ఆశతో పైకి లాగి చూడగా..

వల వేసిన ప్రతిసారి ఆ గంగమ్మకు మొక్కుతారు జాలర్లు. మంచి జలపుష్పాలు తమ వలలో పడాలని వేడుకుంటారు. అయితే అన్నిసార్లు అదృష్టం కలిసిరావాలని లేదు. కొన్నిసార్లు మాత్రం అరుదైన చేపలు పడి వారి దశ మారిపోతుంది. తాజాగా ఒరిస్సాలో అలాంటి ఘటనే జరిగింది.

Viral: జాలర్లు వేసిన వల బలంగా అనిపించింది - ఆశతో పైకి లాగి చూడగా..
Rare Fish
Ram Naramaneni
|

Updated on: Jul 20, 2025 | 4:15 PM

Share

ఒరిస్సాలోని సుబర్ణపూర్ జిల్లా బినికా పట్టణంలో మహానదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ అరుదైన చేప చిక్కింది. వల వేసిన కాసేపటికి బరువుగా అనిపించడంతో పైకి లాగగా.. దాదాపు 100 కిలోల బరువుతో, ఆరు అడుగుల పొడవు గల బోధ చేప అందులో పడింది. దీంతో ఆ జాలర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒడ్డుకు తీసుకొచ్చాక ఆ చేపను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు

ఈ చేప శాస్త్రీయనామం ‘గుంచ్ కాట్‌ఫిష్’ (Goonch Catfish). స్థానికులు మాత్రం బోధ చేపగా పిలుస్తుంటారు. భారీ బరువు పెరిగే ఈ చేపల్లో ఔషధ విలువలు కలిగి ఉంటాయని జాలర్లు తెలిపారు. కిలో చేపకు మార్కెట్ ధర రూ.300 వరకు ఉంటుంది. ఇప్పుడు దొరికిన చేప 100 కిలోలు ఉంది కాబట్టి రూ 30 వేల వరకు గిట్టుబాటు అవుతుంది. శరీర శక్తి పెంపు, కొవ్వు కరుగుదల, కీళ్ల నొప్పుల తగ్గింపు వంటి ఆరోగ్య సమస్యలకు ఈ చేప చక్కగా పని చేస్తుందని స్థానికులు చెబుతున్నారు.

“ఇంత పెద్ద చేప మేము జీవితంలో మొదటిసారి పట్టాము” అని మత్స్యకారుడు అనంతరాం ముదులీ ఆనందం వ్యక్తం చేశారు. “గతంలో ఎక్కువగా 30–40 కిలోల బోధ చేపలే చిక్కేవి. కానీ ఇది నూటికి దగ్గరగా ఉంది. గంగమ్మ దయతో ఇలా జరిగిందని భావిస్తున్నాం” అని ఆయన చెప్పారు.

ఈ ఘటన బినికా ప్రాంతంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాలవారిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఈ చేపను ఒకసారి చూసేయాలని జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
భారత్‌లో ఆడడమే శాపమైందా.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన దిగ్గజ ప్లేయర్
భారత్‌లో ఆడడమే శాపమైందా.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన దిగ్గజ ప్లేయర్
భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఎంతంటే..?
భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఎంతంటే..?
ఈ రాశులవారికి ముక్కు మీద కోపం.. తమకు తామే నష్టం చేసుకుంటారు!
ఈ రాశులవారికి ముక్కు మీద కోపం.. తమకు తామే నష్టం చేసుకుంటారు!
ఇటు వానలు.. అటు ఎండలు.. వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో..
ఇటు వానలు.. అటు ఎండలు.. వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో..
రేర్ పిక్.. చిరంజీవి, వెంకీ మధ్యలో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
రేర్ పిక్.. చిరంజీవి, వెంకీ మధ్యలో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
బజాజ్ ఫిన్సర్వ్ ఆఫర్స్.. నచ్చిన EMI ఆప్షన్లతో భారీ పర్సనల్ లోన్స్
బజాజ్ ఫిన్సర్వ్ ఆఫర్స్.. నచ్చిన EMI ఆప్షన్లతో భారీ పర్సనల్ లోన్స్
వారికి మోగబోతున్న ప్రమాద గంటలు.. కష్టాల సునామీ స్టార్ట్..
వారికి మోగబోతున్న ప్రమాద గంటలు.. కష్టాల సునామీ స్టార్ట్..
రోజూ ఒక అరటిపండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
రోజూ ఒక అరటిపండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??
తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??
ఆ టాలీవుడ్ హీరో కూతురికి వైద్యం చేసి బతికించిన రాజ శేఖర్
ఆ టాలీవుడ్ హీరో కూతురికి వైద్యం చేసి బతికించిన రాజ శేఖర్