ఆ బేబీ టాల్కమ్ పౌడర్ వాడితే క్యాన్సర్ వస్తుందా..?

చిన్నపిల్లల సబ్బులు, పౌడర్ల ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా చేరువైన జాన్సన్ అండ్ జాన్సన్ తమ ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తమ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపి వేయనున్నట్లు తెలిపింది. కొద్ది రోజులుగా తమ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలు రావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. […]

ఆ బేబీ టాల్కమ్ పౌడర్ వాడితే క్యాన్సర్ వస్తుందా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 6:03 PM

చిన్నపిల్లల సబ్బులు, పౌడర్ల ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా చేరువైన జాన్సన్ అండ్ జాన్సన్ తమ ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తమ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపి వేయనున్నట్లు తెలిపింది. కొద్ది రోజులుగా తమ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలు రావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే అమెరికా,కెనడా దేశాల్లో మాత్రమే తమ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. జాన్సన్ పౌడర్ వాడకం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయంటూ పలు కేసులు కూడా నమోదయ్యాయి. కొన్నేళ్లుగా సాగిన కోర్టు వివాదాల కారణంగా కోట్లాది డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాల్సివస్తోంది. ఇంతగా సంస్థ ఉత్పత్తులపై ఆరోపణలు వస్తున్నప్పటికీ మాత్రం ఆ సంస్థ తమ ఉత్పత్తులు సురక్షితమైనవేనని సమర్ధించుకుంటోంది. అయితే ఇప్పటికే ఉత్పత్తి అయిన స్టాక్ ని మాత్రం రిటైల్ మార్కెట్లో అమ్ముతారని తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలు రావడంతో అమెరికాతో పాటు కెనడా దేశా్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. టాల్కం పౌడర్‌లో ఆస్‌బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నాయన్న ఆరోపణలతో మొత్తం 16,000 కేసులను ఎదుర్కొంటోంది. ప్రజల అలవాట్లు మారడం వలన, తమ ఉత్పత్తుల సురక్షణ పట్ల తప్పుడు ప్రచారంతో కంపెనీ ఉత్పత్తులకు నార్త్ అమెరికాలో డిమాండ్ తగ్గింది. అయితే, కరోనా వైరస్‌తో తలెత్తిన పరిస్థితుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అమెరికా కన్స్యూమర్ వ్యాపారంలో 0. 5 శాతం ఉండే టాల్క్ అమ్మకాలని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. అయితే, ఇప్పటికే ఉత్పత్తి అయి ఉన్న సరుకుల్ని మాత్రం రిటైల్ మార్కెట్లో అమ్ముతారని స్పష్టం చేసింది.