కరోనా కాలంలోనూ పేటీఎం హవా.. దూసుకుపోతుంది

కరోనా వైరస్ కాలంలోనూ పేటీఎం హవా కొనసాగుతోంది. ఒకరకంగా లాక్‌డౌన్ టైం పేటీఎం యాజమాన్యానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా రిటైల్ వ్యాపారుల కోసం వచ్చిన పేటీఎం..

కరోనా కాలంలోనూ పేటీఎం హవా.. దూసుకుపోతుంది
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 8:17 AM

కరోనా వైరస్ కాలంలోనూ పేటీఎం హవా కొనసాగుతోంది. ఒకరకంగా లాక్‌డౌన్ టైం పేటీఎం యాజమాన్యానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా రిటైల్ వ్యాపారుల కోసం వచ్చిన పేటీఎం.. లెడ్జర్ సర్వీస్‌లోనూ దూసుకుపోతుంది. సుమారు 15 వందల కోట్ల రూపాయల విలువ గల చెల్లింపులను.. వినియోగదారుల నుంచి వ్యాపారులకు వచ్చినట్టు పేటీఎం సంస్థ తాజాగా ప్రకటించింది. 2020 జనవరిలో తీసుకొచ్చిన ఈ సర్వీస్‌లో.. ఆ నెల 8 నుంచి మార్చి 14 వరకూ జరిగిన చెల్లింపులను చూస్తే.. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఇప్పటివరకూ.. నాలుగు రెట్లు పెరిగినట్టు తెలిసింది.

కాగా ఈ బిజినెస్ ఖాతాను కిరాణా స్టోర్స్ దుకాణాదారులు, ఆటోమొబైల్ వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారు కూడా ఎక్కువగా వాడుతున్నారు. పేటీఎం వల్ల మరో ఉపయోగమేంటంటే. సరుకును అప్పుగా తీసుకెళ్లినా.. ఆ లావాదేవీలను వ్యాపారులు బిజినెస్ ఖాతాలో నమోదు చేసుకుంటారు. గడువు ముగియగానే వినియోగదారులకు మెసేజ్ రూపంలో రిమైండర్ వెళ్తుంది. దీంతో ప్రత్యేకంగా గుర్తుచేసే పని లేకుండా వ్యాపారులు సులభంగా వసూళ్లు చేసుకోగలుగుతున్నారు. కాగా ప్రస్తుతం 10 లక్షలకు పైగా వ్యాపారులు పేటీఎం సేవలను వినియోగిస్తున్నారని ఆ సంస్థ తెలియజేసింది. అందులోనూ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా.. డబ్బును నేరుగా వాడేందుకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో చాలా మంది వినియోగదారులు పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజుల తగ్గింపు విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

Latest Articles
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే