AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్! ఒక్క కప్పు రూ.5.28 లక్షలు.. అంత ధర ఎందుకంటే?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా జపాన్‌కు చెందిన సెల్లాటో బయాకుయా (Byakuya) గుర్తింపు పొందింది. దీని ధర సుమారు రూ.5.28 లక్షలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన ఈ లగ్జరీ ఐస్‌క్రీమ్ తయారీలో సాకేకాసు, రెండు రకాల చీజ్‌లు, బంగారు రేకులు వంటి అరుదైన పదార్థాలను ఉపయోగిస్తారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్! ఒక్క కప్పు రూ.5.28 లక్షలు.. అంత ధర ఎందుకంటే?
World's Most Expensive Ice
SN Pasha
|

Updated on: May 18, 2026 | 9:02 PM

Share

ఐస్‌క్రీమ్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. మార్కెట్‌లో ఎన్నో ప్రీమియం, లగ్జరీ ఐస్‌క్రీమ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, జపాన్‌కు చెందిన ఒక ప్రత్యేక ఐస్‌క్రీమ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే దీని ధర వింటేనే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సెల్లాటో అనే జపనీస్ లగ్జరీ ఐస్‌క్రీమ్ బ్రాండ్ తయారు చేసిన బయాకుయా (Byakuya) ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రత్యేక ఐస్‌క్రీమ్ ధర సుమారు 8,80,000 జపనీస్ యెన్‌లు. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.5.28 లక్షలకు సమానం. ఈ వివరాలు 2023లో వెలుగులోకి వచ్చాయి. ధరలు కాలానుగుణంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఇది అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

ఈ ఐస్‌క్రీమ్‌కు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా స్థానం లభించింది. దీనిని వైట్ నైట్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఉపయోగించే పదార్థాలే దీని భారీ ధరకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ఐస్‌క్రీమ్ తయారీలో జపనీస్, యూరోపియన్ పదార్థాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా సాకేకాసు అనే అరుదైన పదార్థం ఇందులో ప్రత్యేక ఆకర్షణ. ఇది జపనీస్ సాకే తయారీ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే ప్రత్యేకమైన జున్ను తరహా పదార్థం. దీన్ని తయారు చేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం సమయం పడుతుందని సమాచారం. అదనంగా ఇందులో రెండు రకాల ప్రత్యేక జున్నులను కూడా ఉపయోగిస్తారు.

ఈ ఐస్‌క్రీమ్‌ను మరింత విలాసవంతంగా చూపించేందుకు దానిపై బంగారు రేకుల పలుచని పొరను పూస్తారు. దీంతో దీని ప్రెజెంటేషన్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఈ ప్రత్యేక డెజర్ట్ తయారీలో తాదయోషి యమద అనే ప్రముఖ జపనీస్ చెఫ్ కీలక పాత్ర పోషించారు. రుచి, రూపకల్పన, ప్రీమియం అనుభూతి వంటి అంశాలను ఆయన ప్రత్యేకంగా రూపొందించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ లగ్జరీ ఐస్‌క్రీమ్ ప్రధానంగా జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉందని సమాచారం. ధర ఎంతైనా, ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ప్రేమికులలో మాత్రం ఇది ఒక అరుదైన విలాసవంతమైన డెజర్ట్‌గా గుర్తింపు పొందింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us