Tata Nexon: అది మరి టాటా కారంటే..! బలపరీక్షలో నెగ్గిన టాటా నెక్సాన్.. జీఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్
ముఖ్యంగా మన్నికతో పాటు తక్కువ ధరకే మంచి బిల్డ్ క్వాలిటీతో టాటా కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ టాటా నెక్సాన్ ఎస్‌యూవీ గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్‌లో (జీఎన్‌సీఏపీ) 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ స్కోర్ 2022లో భద్రతా పరీక్ష ఏజెన్సీ ద్వారా అమలు చేసిన మరింత కఠినమైన నిబంధనల ప్రకారం ఎస్‌యూవీ ద్వారా నమోదు చేశారు.

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ అయిన టాటా కార్లపై ప్రపంచవ్యాప్తంగా ఓ క్రేజ్ ఉంది. స్వదేశంతో పాటు విదేశాల్లో టాటా కార్లకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా మన్నికతో పాటు తక్కువ ధరకే మంచి బిల్డ్ క్వాలిటీతో టాటా కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ టాటా నెక్సాన్ ఎస్‌యూవీ గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్‌లో (జీఎన్‌సీఏపీ) 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ స్కోర్ 2022లో భద్రతా పరీక్ష ఏజెన్సీ ద్వారా అమలు చేసిన మరింత కఠినమైన నిబంధనల ప్రకారం ఎస్‌యూవీ ద్వారా నమోదు చేశారు. ఈ స్కోర్‌తో ఈ కారు మునుపటి తరాల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుందని మార్కెట్ నిపుణులు చెబతున్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన 2018 వెర్షన్ కూడా పరీక్షలలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ నేపత్యంలో జీఎన్‌సీఏపీ రేటింగ్ సంబంధించిన మరిన్ని విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
టాటా నెకసీన్ జీఎన్‌సీఏపీ స్కోర్‌తో ఎస్‌యూవీ బ్రాండ్‌కు సంబంధించిన పెద్ద ఎస్‌యూవీల ఫేస్లిఫ్ట్ వెర్షన్లలో చేరింది. అంటే సఫారి, హారియర్ల సరసన నెక్సాన్ కూడా చేరింది. సఫారి, హారియర్‌కు సంబంధించిన ఈ వెర్షన్లు అక్టోబర్ 2023లో వాహనాలకు సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేసే బహుళ అప్‌డేట్‌లతో ప్రారంభించారు. టాటా నెక్సాన్‌కు సంబంధించిన ఐసీఈ వెర్షన్ 34 పాయింట్లకు 32.22 పాయింట్లతో 5-స్టార్ రేటింగ్‌ను సాధించగలిగింది. పరీక్షల ఆధారంగా టాటా నెక్సాన్ సైడ్ ఇంపాక్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్లు, సైడ్ ఇంపాక్ట్ లో తగిన రక్షణను అందించగలిగింది. అయితే సైడ్ పోల్ టెహ్లో ఛాతీ ప్రాంతం అంతగా రక్షించబడలేదని నిపుణులు చెబతున్నారు. ముఖ్యంగా నెక్సాన్ ఎస్‌యూవీ పిల్లల రక్షణ పరంగా మెరుగ్గా ఉంది.
నిర్మాణ సమగ్రతతో పాటు టాటా నెక్సాన్ కారులో ప్రయాణికుల భద్రతకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, మూడు-పాయింట్ సీట్ బెల్టులు, ఐసో ఫిక్స్ నియంత్రణలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ వీక్షణ వ్యవస్థ, ముందు పార్కింగ్ సెన్సార్, టీపీఎంఎస్ వంటి ఫీచర్లతో వస్తుంది. టాటా నెక్సాన్‌కు సంబంధించిన అవుట్ గోయింగ్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 8.14 లక్షలుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








