Kabira EV Bikes: భారత్‌లో మరో రెండు ఈవీ సూపర్ బైక్స్ లాంచ్.. స్టైలిష్ లుక్‌తో పాటు ఫీచర్ల విషయంలో వీటికి ఏవీ సాటిరావంతే..!
వినూత్న అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్ ఫీచర్‌తో ఈవీ ప్రియులను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. నవీకరించిన కేఎం 3000 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. కేఎం3000, కేఎం 3000 వీ వేరియంట్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్ పూర్తి ఫెయిర్డ్ డిజైన్‌తో ఆకర్షిస్తున్నాయి.

గోవాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కబీరా మొబిలిటీ నవీకరించిన కేఎం 3000 ఎంకే 2, కేఎం 4000 ఎంకే2 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వీటి ధర వరుసగా రూ. 1.74 లక్షల నుంచి రూ. 1.76 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది. ఈ మోడల్‌లు ఫాక్స్‌కాన్ సహకారంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా వినూత్న అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్ ఫీచర్‌తో ఈవీ ప్రియులను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. నవీకరించిన కేఎం 3000 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. కేఎం3000, కేఎం 3000 వీ వేరియంట్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్ పూర్తి ఫెయిర్డ్ డిజైన్‌తో ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కబీరా ఈవీ బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కేఎం 3000 బైక్ 4.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే 178 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.కేఎం 3000 వీ 5.15 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ద్వారా 201 కిలోమీటర్లకు పరిధిని అందిస్తుందని వివరిస్తున్నారు. ఈ రెండు వేరియంట్‌లలో 3 రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎకో, సిటీ, స్పోర్ట్స్‌తో పాటు పార్కింగ్, రివర్స్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు వేరియంట్‌లు 12 కేడబ్ల్యూ (16.09 బీహెచ్‌పీ) గరిష్ట శక్తిని, 192 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. ఛార్జింగ్ సౌలభ్యం 1500 వాట్స్ ఆన్‌బోర్డ్ ఛార్జర్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు.
కేఎం 4000
ఎంకే 2 కేఎం 4000 నేక్డ్ బైక్ స్టైల్‌ను పొందుతుంది. అదే విధంగా కేఎం 4000, కేఎం 4000 వీ కేఎం3000కి ఒకే విధమైన పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్‌లు, పనితీరు కొలమానాలతో రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది. మరింత సరళీకృతం చేయడానికి కేఎం 4000, కేఎం 3000 అన్ని అంశాలతో వీ వేరియంట్‌లను అందుతుంది. మొత్తం నాలుగు వేరియంట్‌లకు 120 కేఎంపీహెచ్ గరిష్ట వేగం, 4.5 సెకన్లలో 0 నుండి 60 కేఎంపీహెచ్ వేగాన్ని క్లెయిమ్ చేస్తూ కేఎం 3000, కేఎం 4000 ఎకో మోడ్‌లో 130 కిలోమీటర్లు, సిటీ మోడ్‌లో 150 కిలోమీటర్లు, స్పోర్ట్ మోడ్‌లో 80 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తాయి. అదేవిధంగా కేఎం 3000 వీ, కేఎం 4000 వీ ఆఫర్‌లు ఎకోలో 188 కిలోమీటర్లు స్పోర్ట్స్ మోడ్‌లలో 120 కిలోమీటర్లు, సిటీ మోడ్‌లో 150 కిలోమీటర్లు ఛార్జింగ్ సమయాలతో సుమారుగా 3, 3.5 గంటలు ఉంటాయి.
ఆకట్టుకుంటున్న ఫీచర్లు
ఈ బైక్స్ 2080 ఎంఎం పొడవు, 702 ఎంఎం వెడల్పు, 1141 ఎంఎం ఎత్తు, 1412 ఎంఎం వీల్‌బేస్‌తో రెండూ ఒకే విధమైన కొలతలను పంచుకుంటాయి. మోటార్‌సైకిళ్లు డైమండ్ స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్‌లతో వస్తాయి. 152 కిలోల బరువు, 200 మిమీ వాటర్ వాడింగ్ కెపాసిటీతో 175 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తాయి. ఈ రెండు మోడళ్లలో 13 లీటర్ ఫ్రంక్ స్టోరేజ్ కెపాసిటీతో పాటు షోవా ద్వారా టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపు మోనో-షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. అదనంగా ఈ మోటార్‌సైకిళ్లు బ్లూటూత్, యాప్ కనెక్టివిటీతో కూడిన ఐదు అంగుళాల టీఎఫ్‌టీ క్లస్టర్, స్విచ్ చేసేలా లైట్, డార్క్ థీమ్‌లు కేఎం3000ల కోసం ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కేఎం4000ల కోసం ఎల్ఈడీలు, రీజెనరేటివ్ సిస్టమ్‌తో కూడిన డ్యూయల్ ఛానల్ సీబీఎస్, క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తాయి. కబీరా మొబిలిటీకు సంబంధించిన డీలర్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీలు మార్చి 2024లో ప్రారంభంకానున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








