Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MX Moto M16: ఎంఎక్స్ మోటో నుంచి నయా సూపర్ బైక్ లాంచ్.. ఆకట్టుకునే లుక్‌తో మతిపోయే ఫీచర్స్..!

స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకూ ఎప్పటికప్పుడు సరికొత్త ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఎంఎక్స్ మోటో కంపెనీ ఎం 16 పేరుతో మరో కొత్త ఈవీ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ క్రూయిజర్ రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్‌ ధరతో తో ప్రారంభించబడింది. ఈ కంపెనీ బ్యాటరీ ప్యాక్ కోసం 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీ, పూర్తి మెటల్ బాడీతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

MX Moto M16: ఎంఎక్స్ మోటో నుంచి నయా సూపర్ బైక్ లాంచ్.. ఆకట్టుకునే లుక్‌తో మతిపోయే ఫీచర్స్..!
Mxmoto5
Follow us
Srinu

|

Updated on: Feb 16, 2024 | 12:30 PM

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఈవీ వాహనాల అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. అమెరికా, చైనా తర్వాత భారతదేశంలోనే ఈవీ వాహనాల సేల్స్ అధికంగా ఉన్నాయి. దీంతో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకూ ఎప్పటికప్పుడు సరికొత్త ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఎంఎక్స్ మోటో కంపెనీ ఎం 16 పేరుతో మరో కొత్త ఈవీ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ క్రూయిజర్ రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్‌ ధరతో తో ప్రారంభించబడింది. ఈ కంపెనీ బ్యాటరీ ప్యాక్ కోసం 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీ, పూర్తి మెటల్ బాడీతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఫీచర్లు ఈవీ వాహన ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. కాబట్టి ఎంఎక్స్ మోటో ఎం 16 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎంఎక్స్ మోటో ఎం 16 డిజైన్

అన్ని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌ల వంటి స్ట్రీట్ నేకెడ్‌ల మాదిరిగా కాకుండా ఎంఎక్స్ మోటో ఒక క్రూయిజర్‌ను నిర్మించడానికి ఎంచుకుంది. ఐసీఈ విభాగంలో కూడా తక్కువ మంది పోటీదారులు ఉన్న సెగ్మెంట్‌లో ఎం 16 అత్యంత నిరోధక మెటల్ బాడీతో తయారు చేశారు. ఇది భారతీయ పరిస్థితులకు అనువైనదిగా కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎంఎక్స్ మోటో ఎం 16 మస్కులర్ ట్యాంక్, చిన్న ఫ్లైస్క్రీన్‌తో రౌండ్ హెడ్‌లైట్, క్లాసిక్ స్టెప్-అప్ డిజైన్‌తో సింగిల్-పీస్ సీటు, విస్తృత హ్యాండిల్ బార్, యూఎస్‌డీ ఫోర్క్‌లు, డ్యూయల్ రియర్ షాక్‌లు, 17 అంగుళాల టైర్లు, రెండు టైర్లకు డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. 

ఎంఎక్స్ మోటో ఎం 16 ఫీచర్లు

ఎంఎక్స్ మోటో ఎం16 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ బైక్ పూర్తి ఛార్జ్‌పై 160-220 కిలో మీటర్ల పరిధిని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఈ బైక్ కేవలం మూడు గంటల్లో 0 నుంచి 90 శాతం వరకు రీఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అయితే హబ్-మౌంటెడ్ మోటార్ 140 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ పరిమాణం లేదా ఎం16కు సంబంధించిన యాక్సిలరేషన్, గరిష్ట వేగం గురించి కంపెనీ వివరాలను వెల్లడించలేదు. ఎంఎక్స్ మోటో ఎం16 ఆన్‌బోర్డ్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ సిస్టమ్‌తో బ్లూటూత్ కనెక్టివిటీతో టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వస్తుంది. మోటార్‌సైకిల్‌లో క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, రివర్స్ మోడ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి