Scooters Recalls: రెండేళ్ల కిందటి నుంచి కొన్న స్కూటర్లపై కీలక నిర్ణయం.. ఏకంగా 3 లక్షల స్కూటర్ల రీకాల్
కంపెనీ ప్రకటన ప్రకారం.. ఈ ద్విచక్ర వాహన రీకాల్ అనేది Ray ZR 125 Fi హైబ్రిడ్, Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్ మోడల్స్ (జనవరి 2022 నుండి మోడల్‌లు) ఎంపిక చేసిన యూనిట్లలో 'బ్రేక్ లివర్' ఫంక్షన్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. సంబంధిత వినియోగదారులకు విడిభాగాలను ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రీకాల్ కింద ఏ కస్టమర్ల స్కూటర్లు కవర్ చేయబడతాయో తెలుసుకోవడానికి మీరు ఇండియా యమహా మోటార్..

మీకు స్కూటర్ ఉందా..? మరి అది యమహా కంపెనీ స్కూటరేనా? అయితే మీకో అలర్ట్. యమహా ఇండియా మోటార్స్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఏకంగా 3 లక్షల స్కూటర్లను వెనక్కి పిలిపిస్తోంది. బ్రేక్ భాగాల్లో సమస్య తెలిత్తినట్లు గుర్తించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా మొత్తంగా 3 లక్షలకుపైగా స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. యమహా ఇండియా మోటార్స్ స్కూటర్లు వాడుతున్న వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి.
దేశంలోని ద్విచక్ర వాహనాలైన సుమారు 3 లక్షల స్కూటర్లను రీకాల్ చేస్తోంది. ఈ యూనిట్లు 125 cc స్కూటర్ మోడల్స్ రే ZR 125 Fi హైబ్రిడ్, ఫాసినో 125 Fi హైబ్రిడ్ ఉన్నాయి. ఈ స్కూటర్లలో బ్రేక్ భాగాలలో సమస్యలు ఉన్నందున వాటిని సరిచేయడానికి రీకాల్ చేస్తున్నారు. ఇండియా యమహా జనవరి 1, 2022 – జనవరి 4, 2024 మధ్య తయారు చేసిన స్కూటర్ యూనిట్లను తక్షణం అమలులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. తమ ఉత్పత్తుల అధిక నాణ్యత, భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని కంపెనీ ప్రకటనలో తెలిపింది. దీని కింద ఇండియా యమహా మోటార్ సుమారు 3 లక్షల యూనిట్ల 125 సిసి స్కూటర్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
విడిభాగాలు ఉచితంగానే..
కంపెనీ ప్రకటన ప్రకారం.. ఈ ద్విచక్ర వాహన రీకాల్ అనేది Ray ZR 125 Fi హైబ్రిడ్, Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్ మోడల్స్ (జనవరి 2022 నుండి మోడల్‌లు) ఎంపిక చేసిన యూనిట్లలో ‘బ్రేక్ లివర్’ ఫంక్షన్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. సంబంధిత వినియోగదారులకు విడిభాగాలను ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
స్కూటర్ రీకాల్ కిందకు వస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా?
రీకాల్ కింద ఏ కస్టమర్ల స్కూటర్లు కవర్ చేయబడతాయో తెలుసుకోవడానికి మీరు ఇండియా యమహా మోటార్ వెబ్‌సైట్ సర్వీస్ సెక్షన్‌ని సందర్శించవచ్చు. ఇక్కడ కస్టమర్ తన వాహనం ఛాసిస్ నంబర్ వివరాలను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కాకుండా యమహా కస్టమర్‌లు సహాయం కోసం సమీపంలోని యమహా సర్వీస్ సెంటర్‌ను కూడా సందర్శించవచ్చు.
రీకాల్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయంటే..
ఇండియా యమహా మోటార్ స్కూటర్ శ్రేణిలో Aerox 155, RAYZR స్ట్రీట్ ర్యాలీ 125 Fi, RAYZR 125 Fi, MotoGP ఎడిషన్, FASCINO 125 Fi ఉన్నాయి. అలాగే మోటార్‌సైకిల్ శ్రేణిలో R3, MT-03, R15M, R15 V4, MotoGP ఎడిషన్, R15S, MT-15 Ver 2.0, FZ-X, FZ-S FI Ver 4.0 DLX, FZ-S FI Ver 4.0, FZ-S FI Ver 3.0, FZ-FI ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








