Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electoral Bond: ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి? వాటిని సుప్రీం కోర్టు ఎందుకు రద్దు చేసింది?

విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, అంతేకాకుండా ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు క్రిడ్ ప్రోకు దారితీసే అవకాశం ఉందని న్యాయ స్థానం పేర్కొవంది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే ఎలక్టోరల్ బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Electoral Bond: ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి? వాటిని సుప్రీం కోర్టు ఎందుకు రద్దు చేసింది?
Electoral Bonds
Follow us
Subhash Goud

|

Updated on: Feb 16, 2024 | 7:58 AM

సార్వత్రిక ఎన్నికల ముందు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని వెంటనే రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని కూడా ఆదేశించింది. ఈ బాండ్ల కోసం IT చట్టంలోనూ, ప్రజాప్రాతినిథ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఎలక్టోరల్‌ బాండ్స్‌కు విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లు’ రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, అంతేకాకుండా ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు క్రిడ్ ప్రోకు దారితీసే అవకాశం ఉందని న్యాయ స్థానం పేర్కొవంది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే ఎలక్టోరల్ బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇంతకీ ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి?

ఇంతకీ ఈ ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి? దీని గురించి చాలా మందికి తెలియదు. ఎలక్టోరల్ బాండ్స్.. వ్యక్తులు లేదా సంస్థలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఆర్థిక పరికరంగా పని చేస్తాయి. రాజకీయ పార్టీలకు నిధుల సహకారం కోసమే ఈ బాండ్‌లను ప్రత్యేకంగా జారీ చేయబడుతుంది. ఇలాంటి వాటినే ఎలక్టోరల్‌ బాండ్‌ అంటారు. వీటిని రూ.1,000, రూ.10,000, రూ.1 లక్ష, రూ.10 లక్షలు, రూ.1 కోటి గుణిజాలలో విక్రయించబడతాయి. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంక్, రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

ఈ బాండ్లకు  ఎవరు అర్హులు?

ఎలక్టోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్ మాత్రమే. ఇండియాకు చెందిన కొందరు, అలాగే కంపెనీల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను ఉపయోగిస్తుంటారు. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 బడ్జెట్ లో మొదటి సారి ప్రవేశ పెట్టారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీలకు ఇవ్వడానికి ఒక ఆర్థిక పరికరంగా పని చేస్తుంది. అయితే, ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. అలాగే ఈ ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక, ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించడానికి అర్హులు.

ఎలక్టోరల్ బాండ్ల ముఖ్యాంశాలు

  • ఎలక్టోరల్ బాండ్లను రూ. 1000, రూ. 10,000 రూ. 1 లక్ష, రూ. 1 కోటి గుణిజాలలో కొనుగోలు చేయవచ్చు.
  • ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన SBI శాఖలలో అందుబాటులో ఉంటాయి.
  • ఎలక్టోరల్ బాండ్లను KYC ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేయవచ్చు.
  • బాండ్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు కంట్రిబ్యూటర్లు ఈ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి అందిస్తారు.
  • బాండ్‌పై దాత పేరు ఉండదు దాని వివరాలు బ్యాంకు వద్ద మాత్రమే ఉంటాయి.
  • ఈ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు.
  • కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి త్రైమాసికం ప్రారంభంలో 10 రోజుల పాటు బాండ్లను కొనుగోలు చేస్తుంటారు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి