AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm Rules: పేటీఎం ఫాస్టాగ్ ఉందా..? ఫాస్టాగ్ మూసేయాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!

పేటీఎం పేమెంట్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ వినియోగంపై తన వైఖరిని స్పష్టం చేసింది . దీని ప్రకారం వినియోగదారులు తమ వ్యాలెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు ఎనేబుల్ చేసిన టోల్, పార్కింగ్ వ్యాపారుల వద్ద చెల్లించడానికి ఫాస్టాగ్‌ను ఉపయోగించవచ్చు. అయితే పేటీఎం ఫాస్టాగ్స్‌లో టాప్అప్‌లు మాత్రం అందుబాటులోఉండవు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన పాత ఫాస్టాగ్ నుంచి మరొక బ్యాంక్ నుండి పొందినా కొత్త ఫాస్టాగ్‌కు క్రెడిట్ బ్యాలెన్స్ బదిలీ ఫీచర్ అందుబాటులో లేదు.

Paytm Rules: పేటీఎం ఫాస్టాగ్ ఉందా..? ఫాస్టాగ్ మూసేయాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!
Paytm Fastag
Nikhil
|

Updated on: Mar 18, 2024 | 1:11 PM

Share

పేటీఎంపై ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు అమల్లోకి వచ్చిన విషయం విధితమే. ముఖ్యంగా మార్చి 15 నుంచి కొత్త డిపాజిట్ల అంగీకార గడువు అమలులోకి వచ్చినందున పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ కష్టమర్లు తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాల సమితిని విడుదల చేసింది. ఈ ఎఫ్ఏక్యూలు పేటీఎం బ్యాంక్ వెబ్ సైట్లో ప్రచురించారు. అలాగే పేటీఎం పేమెంట్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ వినియోగంపై తన వైఖరిని స్పష్టం చేసింది . దీని ప్రకారం వినియోగదారులు తమ వ్యాలెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు ఎనేబుల్ చేసిన టోల్, పార్కింగ్ వ్యాపారుల వద్ద చెల్లించడానికి ఫాస్టాగ్‌ను ఉపయోగించవచ్చు. అయితే పేటీఎం ఫాస్టాగ్స్‌లో టాప్అప్‌లు మాత్రం అందుబాటులోఉండవు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన పాత ఫాస్టాగ్ నుంచి మరొక బ్యాంక్ నుండి పొందినా కొత్త ఫాస్టాగ్‌కు క్రెడిట్ బ్యాలెన్స్ బదిలీ ఫీచర్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో పేటీఎం ఫాస్టాగ్‌ను ఎలా మూసేయాలో? తెలుసుకుందాం.

పేటీఎం ఫాస్టాగ్ మూసేయడానికి సూచనలు

  • పేటీఎం యాప్‌ను తెరిచి సెర్చ్ మెనూలో “ఫాస్ట్ ట్యాగ్ నిర్వహణను ఎంచుకోవాలి. 
  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్‌కు లింక్ చేయబడిన అన్ని వాహనాల జాబితా వస్తుంది. 
  • ఇప్పుడు ఆ పేజీకు సంబంధించిన కుడి ఎగువ విభాగంలో “క్లోజ్ ఫాస్ట్యాగ్ ఎంపిక”ని ఎంచుకోవాలి.
  • ఫాస్ట్ ట్యాగ్ మూసేయాలనుకునే వాహనాన్ని ఎంచుకోవాలి.
  • అనంతరం ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. కన్ఫర్మేషన్ మెసేజ్ స్క్రీన్‌పై బ్లింక్ అవుతుంది. 
  • ఇప్పుడు మీ ఫాస్టాగ్ 5-7 పని దినాలలో మూసివేస్తారు.

అమల్లోకి కొత్త నిబంధనలు 

పేటీెం పేమెంట్స్ బ్యాంక్ ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్‌ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడంపై ఎలాంటి పరిమితులు లేవని తెలిపింది. ఖాతాలు, వ్యాలెట్స్‌లో ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌లు సురక్షితంగా ఉన్నాయని ఆర్బీఐ పేర్కొన్న నేపథ్యంలో డిపాజిట్ చేసిన నిధుల భద్రతకు సంబంధించిన ఆందోళనలను తగ్గిస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి సంబంధించిన ప్రాముఖ్యతను నిపుణులు సూచిస్తున్నప్పటికీ పేటీఎంలో ఉన్న నగదు సురక్షితంగా ఉంది. అయితే వీలైనంత త్వరగా మన సొమ్మును విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమమని నిపుణుల వాదన. ముఖ్యంగా బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా సొమ్ముపై పూర్తి బాధ్యత ఖాతాదారుడికే ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి