Multibagger Stock: వారెవ్వా ఏమి స్టాక్.. ఇన్వెస్టర్లకు కనకవర్షం.. రూ.1.22 లక్షల పెట్టుబడిని రూ. 88 లక్షలుగా మార్చేసింది..
Multibagger Stock: 2021లో మార్కెట్ లో లిస్టైన ఈ ఐపీఓ(IPO) స్టాక్ తన ఇన్వెస్టర్లకు మంచి భారీ లాభాలను అందించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఏప్రిల్ 2021 న ఈ స్టాక్ లిస్ట్ అయింది.
Multibagger Stock: 2021లో మార్కెట్ లో లిస్టైన ఈ ఐపీఓ(IPO) స్టాక్ తన ఇన్వెస్టర్లకు మంచి భారీ లాభాలను అందించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఏప్రిల్ 2021 న ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్(EKI Energy Services) స్టాక్ ఐపీఓగా లిస్టింగ్ అయింది. షేరుకు రూ. 100 నుంచి రూ.102 మధ్య బ్యాండ్ ప్రైజ్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ షేరు లిస్టింగ్ సమయంలో 37 శాతం పెరిగి రూ. 140 వద్ద లిస్ట్ అయింది. ప్రస్తుతం ఈ షేరు ధర మార్కెట్ రేటు ప్రకారం రూ. 7331 గా ఉంది. అంటే సుమారుగా షేరు లిస్టింగ్ సమయంలో ఉన్న ఇష్యూ ధర కంటే 7187 శాతానికి పైగా లాభాన్ని ఇప్పటి వరకు స్టాక్ ఇన్వెస్టర్లకు అందించింది.
గత ఒక నెలలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ అమ్మకాల ఒత్తిడిలో ఉంది. ఆ సమయంలో దాదాపు 16 శాతం పడిపోయింది. గత 6 నెలల్లో, ఈ BSE SME స్టాక్ రూ.1900 నుంచి రూ. 7625 స్థాయిలకు పెరిగింది. ఈ సమయంలో దాదాపు 300 శాతం పెరిగింది. సంవత్సరం కాలంలో ఈ మల్టీబ్యాగర్ షేర్ ధర దాదాపు 26 శాతం తగ్గింది.. అయితే ఇది ప్రారంభమైనప్పటి నుంచి గత 11 నెలల కాలంలో ఇది రూ.140 నుంచి రూ. 7,625 స్థాయిలకు చేరుకుంది. దాని లిస్టింగ్ నుంచి 4450 శాతం మేరు పెరుగుదలను నమోదు చేసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.5,241 కోట్లుగా ఉంది.
రూ.1.22 లక్షలు పెట్టుబడి రూ.88 లక్షల రాబడి..
కంపెనీ ఐపీఓ సమయంలో ఒక లాట్ అంటే 1200 షేర్లను అప్పటి ఇష్యూ ధర రూ. 102 చొప్పున రూ. 1,22,400 పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు షేరు మంచి రాబడిని అందించింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం 1200 షేర్లు* 7331= 88 లక్షలుగా ఉంది. అంటే 86.78 లక్షల ఆదాయాన్ని అందించింది.
ఇవీ చదవండి..
Market News: ఈ వారం మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ ఉంటుందా.. ఈ 4 విషయాలు చాలా కీలకం..