Home loans: హోమ్‌లోన్‌లపై వడ్డీరేట్ల బాదుడు..? ఆ వడ్డీ రేట్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటంటే..?

సొంతిల్లు కట్టుకోవాలని, ఫ్లాట్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో ఉండేవారు ముందుగా సొంతింటికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం బ్యాంకులు హోమ్ లోన్లు మంజూరు చేస్తాయి. ఆయా బ్యాంకుల నిబంధనల మేరకు మేరకు ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించాలి.

Home loans: హోమ్‌లోన్‌లపై వడ్డీరేట్ల బాదుడు..? ఆ వడ్డీ రేట్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటంటే..?
Home Loan
Follow us

|

Updated on: Aug 06, 2024 | 9:25 PM

సొంతిల్లు కట్టుకోవాలని, ఫ్లాట్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో ఉండేవారు ముందుగా సొంతింటికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం బ్యాంకులు హోమ్ లోన్లు మంజూరు చేస్తాయి. ఆయా బ్యాంకుల నిబంధనల మేరకు మేరకు ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించాలి. దీనిలో రుణం మొత్తం, వడ్డీ కలిపి ఉంటుంది. అయితే హోమ్ లోన్లలో రెండు రకాలు ఉంటాయి. వాటిని ఫిక్స్ డ్ రేట్, ఫ్లోటింగ్ రేట్ రుణాలుగా పిలుస్తారు. రుణం తీసుకునే ముందు వీటిని మనం ఎంపిక చేసుకోవాలి. ఈ రెండు రకాల రుణాల మధ్య తేడాలు, ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఫిక్స్ డ్ రేట్

ఫిక్స్ ట్ రేటు రుణాలను స్థిర రుణాలు అంటారు. పేరుకు తగ్గట్టుగానే వీటి వడ్డీరేటు స్థిరంగా ఉంటుంది. రుణం తీసుకునప్పుడు నిర్ణయించిన కాలవ్యవధికి వడ్డీరేటు అలాగే ఉంటుంది. అంటే రుణం తీరేవరకూ వడ్డీ రేటు మారదు. ఈఎంఐల మొత్తం పెరగదు, తగ్గదు. అయితే ప్రారంభ రేటు ఫ్లోటింగ్ రేట్ రుణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు నిర్ణీత వ్యవధి తర్వాత ఫిక్స్ డ్ రేట్ ను ఫ్లోటింగ్ రేటుగా మారుస్తాయి. కాబట్టి రుణం తీసుకునేముందు ఈ నిబంధనలను పరిశీలించాలి.

ఫ్లోటింగ్ రేట్

ఫ్లోటింగ్ రేట్ రుణాలకు సంబంధించి వడ్డీరేటు మారుతూ ఉంటుంది. ఈ మార్పు అనేది మార్కెట్ హెచ్చుతగ్గులు, రెపో రేటు మార్పులపై ఆధారపడి ఉంటుంది. అంటే రుణం తీసుకున్నప్పుడు నిర్ణయించిన ఈఎంఐ మొత్తం కొంత కాలానికి మారుతుంది. అది పెరగవచ్చు, లేదా తగ్గిపోవచ్చు. ఒకవేళ మీరు ఈఎంఐ మొత్తాన్ని అలాగే ఉండాలని కోరుకుంటే, లోన్ కాలపరిమితి పెరుగుతుంది.

లాభనష్టాలు

  • ఫిక్స్‌డ్ రేట్ రుణం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం స్థిరత్వం. ఈఎంఐ మొత్తం మారదు కాబట్టి మీ ఆర్థిక ప్రణాళికకు ఇబ్బంది ఉండదు. కానీ ఫ్లోటింగ్ రేట్ల విషయంలో ఈఎంఐ మొత్తం పెరుగుతుంది. లేకపోతే కాలవ్యవధి ఎక్కువవుతుంది. ఇది మీ ఆర్థిక ప్రణాళికకు అంతరాయం కలిగిస్తుంది.
  • ఫిక్స్ డ్ రేట్ రుణంలో వడ్డీ ఎప్పటికీ తగ్గదు. కానీ ఫ్లోటింగ్ రుణాల విషయంలో రెపోరేటు తగ్గితే దానికి అనుగుణంగా వడ్డీరేటు కూాడా తగ్గుతుంది.
  • ఫిక్స్ డ్ రేట్  రుణాల వడ్డీరేటు ఫ్లోటింగ్ రేట్ రుణాల కంటే 1 నుంచి 2 శాతం ఎక్కువగా ఉంటుంది. ఫ్లోటింగ్ రేట్ రుణాలకు సంబంధించి ప్రారంభంలో స్థిర రేట్ కంటే తక్కువే. కానీ కాలక్రమేణా పెరగవచ్చు.
  • ఫిక్స్ డ్ రేట్ రుణాల చెల్లింపు కాలవ్యవధిలో మార్పు ఉండదు. కానీ ఫ్లోటింగ్ రుణాలకు మారే అవకాశం ఉంది.
  • ఫిక్స్ డ్ రేట్ రుణాలకు ఈఎంఐ ఓకేలా ఉంటుంది. ఫ్లోటింగ్ రుణాలకు నిబంధనల మేర మారతాయి.
  • వడ్డీరేట్ల పెరిగే అవకాశం ఉన్నప్పుడు స్థిర రుణాల వల్ల లాభం కలుగుతుంది. వడ్డీరేట్లు తగ్గుతాయని భావిస్తే ఫ్లోటింగ్ రుణాలను ఎంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..