భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం.. ధరల నిరంతర పెరుగుదల కారణమేంటి?

ద్రవ్యోల్బణం.. ప్రపంచ దేశాలకు ఇప్పుడిదొక పెద్ద మహమ్మారిగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలసీదారులు, పెట్టుబడిదారులు..

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం.. ధరల నిరంతర పెరుగుదల కారణమేంటి?
Inflation
Follow us

|

Updated on: Nov 15, 2021 | 5:14 PM

ద్రవ్యోల్బణం.. ప్రపంచ దేశాలకు ఇప్పుడిదొక పెద్ద మహమ్మారిగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలసీదారులు, పెట్టుబడిదారులు నిరంతరం ద్రవ్యోల్బణం గణాంకాలపై దృష్టి సారిస్తున్నారు. ఇదిలా ఉంటే భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేది శాశ్వతమైనది. ముఖ్యంగా కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ కూడా ‘సాధారణం’ అని అనుకున్న వాటి కంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు.

అమెరికా, యూరప్, చైనా, జపాన్.. ఇలా ప్రపంచమంతటా కూడా కోవిడ్ వైరస్ మాదిరిగానే ద్రవ్యోల్బణం ఓ మహమ్మారిలా విస్తరిస్తోంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే… ప్రపంచమంతటికీ చైనా కర్మాగారం. మరి అలాంటి కర్మాగారంలోనే వస్తువులు ఖరీదుగా ఉంటే.. మీ మార్కెట్‌లోనూ అదే పరిస్థితి నెలకొంటుంది. ఇక ఇదే విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ధృవీకరించారు. అమెరికాలో తయారయ్యే పెన్సిల్‌కి.. బ్రెజిల్‌ నుంచి కలపను.. ఇండియా నుంచి గ్రాఫైట్‌ను దిగుమతి చేసుకోవాలి. ఈ రెండు పదార్ధాలు లేకుండా.. ప్రోడక్ట్ పూర్తి కాదు. ఉత్పత్తి నిలిచిపోతుంది. అందుకే మన డెస్టినీ(Destiny) మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎలా ఉందంటే.?

  • అమెరికాలో ద్రవ్యోల్బణం మూడు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంది. (అక్టోబర్‌లో 6.2 శాతం)
  • జపాన్‌లో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.
  • చైనాలో ద్రవ్యోల్బణం గత నెల కంటే రెండింతలు పెరిగింది.(సెప్టెంబర్‌లో(0.7) నుంచి అక్టోబర్‌లో(1.5%))
  • జర్మనీలో కూడా ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 4.5 శాతంగా ఉంది.

అసలు ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతోంది?

ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంపై పడిన ద్రవ్యోల్బణ ప్రభావం తమ దేశం భరిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. గత ఏడాది కాలంలో ముడి చమురు ధరలు రెండింతలు రెట్టింపు అయ్యాయి. అలాగే షిప్పింగ్ ఛార్జీలు సైతం 250 శాతం పెరిగాయి. చైనాలో బొగ్గు కొరత, యూరోప్‌లో గ్యాస్ కొరత ఏర్పడింది. ఇన్నాళ్లు ద్రవ్యోల్బణం కోసం ఎదురుచూసిన జపాన్.. ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం కంపెనీల లాభాలను ఆవిరి చేస్తుందని, వినియోగదారుడి వద్దకు చేరుకునేసరికి ఉత్పత్తుల గిరాకీని తగ్గిస్తుందని ఆందోళన చెందుతోంది.

అయితే ఈ ద్రవ్యోల్బణానికి మరో కారణం లేకపోలేదు. అదే డిమాండ్ పెరగడం లేదా నిలిచిపోవడం అని ఎక్స్‌కార్ట్ సెక్యూరిటీస్ హెడ్ (పరిశోధన) ఆసిఫ్ ఇక్బాల్ అన్నారు. అమెరికా, యూరోప్ ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చాయి. ఇక మార్కెట్ తెరుచుకోగానే ప్రజలు డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. సప్లై చైన్(Supply Chain) సమస్య కూడా ద్రవ్యోల్బణంకు ఆజ్యం పోసిందని చెప్పాలి. సెమీకండక్టర్ల కొరత కారణంగా మారుతి వంటి కంపెనీల ఉత్పత్తులు స్తంబించిపోయాయి. దీని కారణంగా అమెరికా, యూరోప్ దేశాల్లో ఈ ఏడాది క్రిస్మస్ అత్యంత ఖరీదైనదిగా మారనుంది. దీనికి కారణం ఏంటో తెలియాలంటే.. ఈ ముఖ్య విషయాలను ఖచ్చితంగా వినాల్సిందే.!

చైనాలో, ఫ్యాక్టరీ ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఒక ప్రత్యేక స్కేల్ ఉంది. అదే ఉత్పత్తిదారుడి ధర సూచిక. ఇది చైనా కర్మాగారాల్లో వస్తువుల తయారీ ధర పెరుగుదల వేగాన్ని సూచిస్తుంది. ఈ సూచిక ప్రస్తుతం 13.5 శాతం వద్ద ఆల్ టైమ్ గరిష్ఠంగా ఉంది.

భారతదేశంపై దాని ప్రభావం ఎలా ఉంది.?

కోవిడ్ ముందు నుంచే భారతీయులు ద్రవ్యోల్బణం భారాన్ని ఎదుర్కొంటున్నారు. మహమ్మారి అనంతరం దిగుమతుల ద్రవ్యోల్బణం దేశంలోని ఇబ్బందులను మరింతగా పెంచింది. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.