బంపర్ ఆఫర్ ఇదే.. రూ.8 వేలకే సింగపూర్ వెళ్లొచ్చు.. ట్రైన్ కంటే తక్కువ రేట్లు..
విమానం ఎక్కాలనే మీ కల నిజం చేసుకోవడానికి ఇది మంచి సమయం. దీపావళి సందర్భంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఫ్లయింగ్ కనెక్షన్స్ సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్పెషల్ సేల్‌లో దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్ల రేట్లు కేవలం రూ. 2,390 నుంచే మొదలవుతున్నాయి. ఈ ఆఫర్ అక్టోబర్ 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఫ్లైట్ ఎక్కాలని ఎవరికి ఉండదు.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనేది చాలా మంది కల. కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫ్లైట్‌లో వెళ్లొచ్చు. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఫ్లయింగ్ కనెక్షన్స్ సేల్ పేరుతో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లను అతి తక్కువ ధరకే బుక్ చేసుకునే అద్భుత అవకాశం లభిస్తుంది.
ఈ ప్రత్యేక సేల్ అక్టోబర్ 13న ప్రారంభమై అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్లపై నవంబర్ 1, మార్చి 31, 2026 మధ్య ప్రయాణించవచ్చు. దేశీయ టిక్కెట్ రేట్లు కేవలం రూ.2,390 నుండి ప్రారంభమవుతుండగా.. అంతర్జాతీయ ఫ్లైట్ టిక్కెట్లు కేవలం రూ.8,990 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇండిగో దాదాపు 90 దేశీయ, 40 కి పైగా అంతర్జాతీయ నగరాలను అనుసంధానించే 8,000కి పైగా మార్గాల్లో ఈ ఆఫర్‌ను అందిస్తోంది.
దేశీయ టికెట్ రేట్స్ ఇలా..
- కొచ్చి నుండి విశాఖపట్నం – రూ.4,090
- కొచ్చి నుండి శివమొగ్గ – రూ.2,390
- లక్నో టు రాంచీ రూ.3,590
- పాట్నా టు రాయ్‌పూర్ రూ.3,590 నుంచి
- జైపూర్ నుంచి రాయ్‌పూర్ – 4,190
- అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ – 4,490
ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ రూట్స్
- కొచ్చి నుంచి సింగపూర్ – రూ.8,990
- అహ్మదాబాద్ నుండి సింగపూర్ – 9,990
- జైపూర్ నుండి సింగపూర్ రూ.10,190 నుండి
- లక్నో నుండి హనోయ్ రూ.10,990 నుండి
- జైపూర్ నుండి ఆమ్‌స్టర్‌డామ్ – రూ.15,590
షరతులు వర్తిస్తాయి
ఈ ఆఫర్ ఇండిగో నిర్వహించే విమానాలకు మాత్రమే వర్తిస్తుంది. కోడ్‌షేర్ లేదా డైరెక్ట్ విమానాలకు కాదు. టిక్కెట్ బుకింగ్‌లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్‌ను ఇతర ఇండిగో ప్రమోషన్‌లు లేదా డిస్కౌంట్‌లతో కలపడానికి వీలు లేదు. బుకింగ్ చేసుకున్న టిక్కెట్లను మార్చుకోవడం లేదా తిరిగి చెల్లించడం సాధ్యం కాదు. మార్పులు చేయాలంటే ఇండిగో నిబంధనల ప్రకారం అదనపు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆఫర్ గ్రూప్ బుకింగ్‌లకు వర్తించదు. సాధారణంగా పండుగల సమయంలో విమాన టిక్కెట్ల ధరలు పెరుగుతాయి. ఈ సమయంలో ఇండిగో అందించే ఈ ఆఫర్ ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ గమ్యస్థానాలకు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




