Gold Rates: బంగారంలో 24 క్యారెట్‌కి 9 క్యారెట్‌కి మధ్య తేడా ఏంటో తెలుసా?
బంగారం కొనేటప్పుడు 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్.. ఇలా వింటూ ఉంటాం. అయితే ఇలా చాలా రకాల క్యారెట్ క్వాలిటీలు ఉన్నాయని మీకు తెలుసా? వీటిలో ఒక్కోటి ఒక్కో శాతం బంగారాన్ని కలిగి ఉంటుంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం కొనేటప్పుడు 24 క్యారెట్ తీసుకోవాలా? 22 క్యారెట్ సరిపోతుందా అని చాలామంది సందేహంలో ఉంటుంటారు. అయితే ఈ రెండు రకాలే కాదు, 18 క్యారెట్, 9 క్యారెట్ బంగారాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక్కోటి ఒక్కోరకమైన క్వాలిటీ కలిగి ఉంటుంది. క్యారెట్ రకాన్ని బట్టి బంగారం శుద్ధత, రంగు, మెరుపు, బలము, ధరల్లో మార్పులు ఉంటాయి.
24 క్యారెట్
ముందుగా 24 క్యారెట్ విషయానికొస్తే.. ఇది 99.9 శాతం నిజమైన బంగారం. ఇందులో అచ్చంగా బంగారు లోహం మాత్రమే ఉంటుంది. చాలా మృదువుగా అనిపిస్తుంది. కాస్త డెలికేట్ గా ఉంటుంది. అందుకే ఆభరణాల కోసం దీన్ని కాకుండా 22 క్యారెట్ బంగారాన్ని వాడతారు.
22 క్యారెట్
22 క్యారెట్ బంగారంలో 91.6 శాతం నిజమైన బంగారం ఉంటుంది. మిగతా 8.4 శాతం కాపర్, సిల్వర్, నికెల్ వంటి మెటల్స్ ఉంటాయి.. కాబట్టి దీంతో చేసిన ఆభరణాలు 24 క్యారెట్ కంటే కొంచెం బలంగా ఉంటాయి.
18 క్యారెట్
ఇక 18 క్యారెట్ గోల్డ్ విషయానికొస్తే ఇందులో 75 నిజమైన బంగారం ఉంటుంది. మిగతా 25 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. ఇది మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది బ్రైట్ అండ్ వార్మ్ యెల్లో రంగులో ఉంటుంది. సంవత్సరాల పాటు పాడవ్వకుండా ఉంటుంది. చిన్న చిన్న గీతలను తట్టుకుంటుంది.
9 క్యారెట్
ఇక 9 క్యారెట్ లో కేవలం 37.5 శాతమే నిజమైన బంగారం ఉంటుంది. మిగతా 62.5 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో బంగారం కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే దీనికి రీ సేల్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఇకపోతే వన్ క్యారెట్ గోల్డ్ కూడా ఉంటుంది. ఇది కేవలం 4.1667 శాతం బంగారాన్ని కలిగి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




