AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM WANI: మీ ఇంట్లో వైఫై ఉందా? మిగిలిన డేటాను ప్రభుత్వానికి అమ్మి డబ్బు సంపాదించొచ్చు! ప్రాసెస్ సింపుల్!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటుంది. అయితే వైఫైలో లభించే డేటా లిమిట్ ని ఎవరూ పూర్తిగా ఉపయోగించుకోరు. చాలా డేటా వేస్ట్ అయిపోతుంటుంది. అయితే ఇలా మిగిలిపోయే డేటాని ప్రభుత్వానికి అమ్మొచ్చని మీకు తెలుసా? దీనికై ప్రత్యేకంగా ఒక పథకం ఉంది. ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

PM WANI: మీ ఇంట్లో వైఫై ఉందా? మిగిలిన డేటాను ప్రభుత్వానికి అమ్మి డబ్బు సంపాదించొచ్చు! ప్రాసెస్ సింపుల్!
Pm Wani
Nikhil
|

Updated on: Oct 13, 2025 | 4:12 PM

Share

ప్రస్తుతం ఇంటర్నెట్ అవసరం బాగా పెరిగిపోయింది. ప్రతి చిన్న పనికీ ఇంటర్నెట్ కావాల్సి వస్తుంది. అయితే ఇప్పటికీ ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు చేయూతనివ్వడం కోసం ప్రభుత్వం పీఎంవాణి  (PM-WANI) అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మీ వైఫైను ఇతరులకు షేర్ చేస్తూ డబ్బు సంపాదించొచ్చు.

పీఎం వాణి స్కీమ్

పీఎం వాణి పథకం ద్వారా వైఫై యూజర్లు వారి వై-ఫై నెట్‌వర్క్‌ను ఇతర ప్రజల కోసం షేర్ చేయడం ద్వారా ఆదాయం పొందొచ్చు. మీ ఇల్లు లేదా దుకాణంలో వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే..  మీరు దాన్ని ప్రభుత్వ రిజిస్టర్ సిస్టమ్‌తో కనెక్ట్ చేసుకోవాలి. తద్వారా మీ డేటాను అమ్ముకోవచ్చు.

కమీషన్ రూపంలో..

డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా టెలికాం శాఖ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. మీకు ఒక రౌటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే.. పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO)గా కింద మీ డీటెయిల్స్ ను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీ నెట్‌వర్క్ పబ్లిక్ వై-ఫైగా యాక్టివేట్ అవుతుంది. తద్వారా సాధారణ ప్రజలు మీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతారు. అలా మీ డేటే యూసేజ్ ను బట్టి మీకు కమీషన్ లభిస్తుంది.

రిజిస్ట్రేషన్ ఇలా..

మీరు ఈ పథకంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే PM-WANI యాప్‌లో పబ్లిక్ డేటా ఆఫీస్‌గా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మీకు PDO ఐడీ  వస్తుంది. తర్వాత మీరు మీ వై-ఫై రౌటర్‌ను నమోదు చేసి, నెట్‌వర్క్‌ను పబ్లిక్ గా లైవ్ చేయాలి. దీనికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. ఇది ఒక పబ్లిక్ సర్వీస్ లా పరగణిస్తారు. దానికై ప్రభుత్వం మీకు కమీషన్ రూపంలో కొంత ఆదాయాన్ని ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..