AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..! డాలర్‌తో పోలిస్తే ఇప్పుడు ఎన్ని రూపాయలంటే..?

అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 87.97కి పడిపోయింది, ఇది రికార్డు కనిష్టం. ఎగుమతి-ఆధారిత పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోదీ రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ పరిణామాల వల్ల భారత ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..! డాలర్‌తో పోలిస్తే ఇప్పుడు ఎన్ని రూపాయలంటే..?
Indian Rupee Depreciation
SN Pasha
|

Updated on: Aug 29, 2025 | 4:12 PM

Share

భారతదేశ ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ ఆదాయాలపై 50 శాతం అమెరికా సుంకాల ప్రభావంపై ఉద్రిక్తత మధ్య భారత రూపాయి యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే 87.97కి పడిపోయింది. ఇది ఆల్‌టైమ్‌ కనిష్టం. ఈ వారం నుండి అమలు చేయనున్న కొత్త US సుంకాల కారణంగా భారత కరెన్సీ ఒత్తిడిలో ఉంది. అయితే ఫిబ్రవరిలో దాని మునుపటి ఆల్-టైమ్ కనిష్ట స్థాయి 87.9563 ను అధిగమించి, డాలర్‌తో పోలిస్తే కరెన్సీ 0.4 శాతం తగ్గి 87.9763 కు చేరుకుంది.

ఈ సంవత్సరం స్థానిక ఈక్విటీల నుండి నిరంతరం విదేశీ ఉపసంహరణల కారణంగా రూపాయి ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన కరెన్సీగా నిలిచింది. వస్త్రాలు, పాదరక్షలు, ఆభరణాలు వంటి ఎగుమతి-ఆధారిత పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని యూఎస్‌ సుంకాలను ప్రధానంగా పెంచారు. అయితే అమెరికా సుంకాలను తట్టుకొని నిలబడుతూ.. తమ రైతుల, వ్యాపారలను రక్షించుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ ప్రకటించారు.

కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతోనే భారత్‌పై భారీ సుంకాలు విధించినట్లు అమెరికా చెబుతోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం ఆపితేనే సుంకాలు తొలగిస్తామని ఇప్పటికే ట్రంప్‌ భారత్‌ను హెచ్చరించారు. ట్రంప్‌ వార్నింగ్‌ను ఏ మాత్రం లెక్కచేయని ప్రధాని మోదీ, రష్యాతో వాణిజ్యం కొనసాగుతుందని ప్రకటించారు. మరి ఈ క్రమంలో రుపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. మరి దీని నుంచి భారత రుపాయి ఎలా కొలుకుంటుందో చూడాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే
రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?
రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?
మాట్లాడుతుండంగా ఫోన్ కట్ అయింది.. ఆ తర్వాత శవమై కనిపించాడు
మాట్లాడుతుండంగా ఫోన్ కట్ అయింది.. ఆ తర్వాత శవమై కనిపించాడు
తీవ్ర విషాదం.. పశువుల నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి!
తీవ్ర విషాదం.. పశువుల నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి!
చింతపండు పాడవకుండా ఉండాలంటే..ఈ చిన్న చిట్కాలు పాటించండి!
చింతపండు పాడవకుండా ఉండాలంటే..ఈ చిన్న చిట్కాలు పాటించండి!
కొడుకు మాటలు విని మురిసిపోయిన వీరేంద్ర సెహ్వాగ్.. వీడియో వైరల్‌
కొడుకు మాటలు విని మురిసిపోయిన వీరేంద్ర సెహ్వాగ్.. వీడియో వైరల్‌
ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం ద్వారా నెలకు రూ.3 లక్షలు..
ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం ద్వారా నెలకు రూ.3 లక్షలు..
కొనొద్దని తిడతాడు.. అయినా అతడి షాపుకే క్యూ కడుతున్నారు!
కొనొద్దని తిడతాడు.. అయినా అతడి షాపుకే క్యూ కడుతున్నారు!