AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి తక్కువ ధరలు.. భారత నుంచి చైనాకు ఆ వస్తువుల భారీ ఎగుమతి!

భారతదేశం నుంచి చైనాకు ఆయిల్‌మీల్ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో 20 రెట్లు పెరిగి 7.79 లక్షల టన్నులకు చేరాయి. తక్కువ ధరలు, కెనడాపై చైనా విధించిన సుంకాలే ఈ అద్భుత వృద్ధికి కారణం. అయితే, కెనడా సుంకాల ఎత్తివేతతో భవిష్యత్తులో పోటీ పెరుగుతుంది.

అతి తక్కువ ధరలు.. భారత నుంచి చైనాకు ఆ వస్తువుల భారీ ఎగుమతి!
India China
SN Pasha
|

Updated on: Mar 20, 2026 | 5:37 AM

Share

భారతదేశం నుంచి చైనాకు ఆయిల్‌మీల్ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో గణనీయంగా పెరిగాయి. ఎస్‌ఈఏ (Solvent Extractors’ Association of India) గణాంకాల ప్రకారం.. ఈ ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 రెట్లకు పైగా పెరిగి సుమారు 7,79,000 టన్నులకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో కేవలం 38,240 టన్నులే ఎగుమతి కాగా, ఈసారి అది 7,79,016 టన్నులకు పెరిగింది. ఇందులో అధిక భాగం రేప్‌సీడ్ మీల్. తక్కువ ధరలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని ఎస్‌ఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి. మెహతా తెలిపారు. భారతదేశంలో రేప్‌సీడ్ మీల్ ధర టన్నుకు సుమారు 225 డాలర్లు ఉండటం, ఐరోపాతో పోలిస్తే చౌకగా ఉండటంతో చైనా దిగుమతులు పెరిగాయి.

2025 మార్చిలో చైనా, కెనడా ఎలక్ట్రిక్ వాహనాలపై విధించిన పన్నుకు ప్రతిస్పందనగా, కెనడియన్ రేప్‌సీడ్ మీల్, నూనెపై 100 శాతం సుంకాన్ని విధించింది. దీంతో కెనడియన్ సరుకులు ఖరీదైనవిగా మారడంతో, చైనా ప్రత్యామ్నాయంగా భారతదేశం వైపు మొగ్గు చూపింది. అయితే 2026 మార్చి 1 నుంచి డిసెంబర్ 31 వరకు చైనా ఈ 100 శాతం సుంకాన్ని ఎత్తివేయడంతో, భారత ఎగుమతిదారులకు మళ్లీ కెనడా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా 2026 ఫిబ్రవరిలో భారతదేశపు మొత్తం ఆయిల్‌మీల్ ఎగుమతులు 22 శాతం తగ్గి సుమారు 25.7 లక్షల టన్నులకు పడిపోయాయి. మొత్తం 11 నెలల కాలంలో ఎగుమతులు 11 శాతం తగ్గి 34.93 మిలియన్ టన్నులకు చేరాయి. హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. భారతదేశం నుంచి దాదాపు 20 శాతం ఎగుమతులు పశ్చిమ ఆసియాకు, 15 శాతం ఐరోపాకు వెళ్తుండటంతో, ఈ మార్గాల్లో రవాణా అంతరాయాలు పెరిగాయి. ఓడలు ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గాన్ని ఉపయోగించాల్సి రావడంతో ప్రయాణ సమయం 10–15 రోజులు పెరుగుతోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరగడం, కంటైనర్ కొరత వంటి సమస్యలు తీవ్రతరమవుతున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us