Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold ATM: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఏటీఎంకు వెళ్లండి. తొలిసారి మన హైదరాబాద్‌లో..

సాధారణంగా ఏటీఎమ్‌ సెంటర్లకు ఎందుకు వెళ్తారు.? ఏముందు డబ్బులు తీసుకోవడానికి అంటారా. అయితే ఇకపై ఏటీఎం ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. అవును మీరు చదివింది నిజమే, దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను మన హైదరాబాద్‌లో ప్రారంభించారు. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో..

Gold ATM: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఏటీఎంకు వెళ్లండి. తొలిసారి మన హైదరాబాద్‌లో..
Gold Atm In Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 04, 2022 | 10:01 AM

సాధారణంగా ఏటీఎమ్‌ సెంటర్లకు ఎందుకు వెళ్తారు.? ఏముందు డబ్బులు తీసుకోవడానికి అంటారా. అయితే ఇకపై ఏటీఎం ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. అవును మీరు చదివింది నిజమే, దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను మన హైదరాబాద్‌లో ప్రారంభించారు. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎంను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ ఏటీఎంల ద్వారా డెబిట్, క్రెడిట్‌ కార్డు సహాయంతో బంగారం విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్‌ ఏటీఎం నిదర్శనం. బంగారాన్ని తీసుకునేందుకు దేశంలోనే తొలిసారి గోల్డ్‌ ఏటీఎంను నగరంలో ప్రారంభించడం అభినందనీయం. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్‌ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ తరహా ఏటీఎంలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకివస్తే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చారు.

గోల్డ్‌ ఏటీఎంల ఏర్పాటుపై గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్‌ తరుజ్‌ మాట్లాడుతూ… ‘వీటి ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పాటు, మేము జారీ చేసే ప్రీపెయిడ్‌ కార్డులనూ ఉపయోగించుకోవచ్చ’ని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మిషన్‌లలో ఒకేసారి రూ. రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్‌ చేయవచ్చు. ఈ ఏటీఎం ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఇక తర్వలో మరిన్ని ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు సయ్యద్‌ తెలిపారు. ఎయిర్‌పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్‌లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో కూడా గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా 3,000 ఏటీఎంలను ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..