AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు! మార్కెట్లో అసలు నిజమిదే!

దేశీయ స్టాక్ మార్కెట్‌లో డీమ్యాట్ ఖాతాలు 21 కోట్లకు పైగా చేరి చరిత్ర సృష్టించాయి. అయితే, కేవలం 1.48 కోట్ల మందే క్రియాశీల ట్రేడర్లుగా ఉన్నారు. యూనిక్ ఇన్వెస్టర్లు 12.8 కోట్లు. క్యాష్ మార్కెట్‌లో 1.09 కోట్లు, F&Oలో 18 లక్షల మంది ట్రేడింగ్ చేస్తున్నారు.

రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు! మార్కెట్లో అసలు నిజమిదే!
Demat Account
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Apr 08, 2026 | 10:06 AM

Share

దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ తెరవెనుక జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏకంగా 21 కోట్లకు పైగా డీమ్యాట్ ఖాతాలు నమోదయ్యాయి. ఇంత పెద్ద సంఖ్యలో అకౌంట్లు ఉండటం దేశ ఆర్థిక ముఖచిత్రంలో సంచలనంగా మారింది. స్టాక్ మార్కెట్ వైపు ప్రజలు ఎంతగా ఆకర్షితులవుతున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే ఈ 21 కోట్ల ఖాతాల్లో కేవలం 12.8 కోట్ల మంది మాత్రమే యూనిక్ ఇన్వెస్టర్లుగా ఉన్నారు. మిగిలిన ఖాతాలన్నీ ఒకే వ్యక్తికి చెందిన బహుళ అకౌంట్లుగా స్పష్టమవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఖాతాల సంఖ్య వేగంగా పెరుగుతున్నా.. మార్కెట్లో లావాదేవీలు చేసే వారి శాతం దారుణంగా పడిపోయింది. అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి కానీ ట్రేడింగ్ యాక్టివిటీ మాత్రం నిరాశపరుస్తోంది. నెలకు కనీసం ఒక్కసారైనా ట్రేడింగ్ చేస్తున్న యాక్టివ్ ఇన్వెస్టర్ల సంఖ్య చూస్తే వాస్తవం అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా కేవలం 1.48 కోట్ల మంది మాత్రమే మార్కెట్లో చురుగ్గా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అంటే కోట్లలో డీమ్యాట్ అకౌంట్లు ఉన్నా.. క్రియాశీలకంగా ట్రేడింగ్ చేసేది చాలా తక్కువ మంది మాత్రమే.

ఈ యాక్టివ్ ఇన్వెస్టర్లలో కూడా కేవలం క్యాష్ మార్కెట్కే పరిమితమైన వారి సంఖ్య 1.09 కోట్లుగా ఉంది. వీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కేవలం షేర్లను కొని అమ్ముకునే సాధారణ ట్రేడింగ్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. సురక్షితమైన పెట్టుబడుల వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారని ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. క్యాష్ మార్కెట్ తో పాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) విభాగంలో ట్రేడింగ్ చేస్తున్న వారు 18 లక్షల మంది ఉన్నారు. మార్కెట్ ఒడిదుడుకులను అర్థం చేసుకుని కొద్దిపాటి రిస్క్ చేసేందుకు వీరు సిద్ధపడుతున్నారు. ఈ సంఖ్య సాపేక్షంగా తక్కువగానే ఉన్నప్పటికీ.. మార్కెట్ ట్రెండ్స్ నిర్ణయించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరోవైపు కేవలం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) విభాగంలోనే ట్రేడింగ్ చేస్తున్న వారి సంఖ్య 21 లక్షలుగా నమోదైంది. అలాగే మరింత రిస్క్ ఉండే ఆప్షన్స్ ట్రేడింగ్ మాత్రమే చేస్తున్న వారు 20 లక్షల మంది ఉన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే వారు ఈ విభాగం వైపు అడుగులు వేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే భారతీయ స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య చారిత్రక గరిష్టానికి చేరుకున్నా.. వాస్తవంగా పెట్టుబడి పెట్టే వారి శాతం తక్కువగానే ఉంది. చాలా మంది అకౌంట్లు తెరిచి వదిలేస్తున్నారని ఈ డాటా చెబుతోంది. సరైన అవగాహన, ఆర్థిక అక్షరాస్యత పెరిగితేనే ఈ ఖాతాల సంఖ్యకు తగ్గట్టుగా మార్కెట్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యవంశీ ‘గోల్డెన్ డక్’.. చిన్నపిల్లలా చిందులేసిన కావ్యపాప..!
సూర్యవంశీ ‘గోల్డెన్ డక్’.. చిన్నపిల్లలా చిందులేసిన కావ్యపాప..!
ఆ నటుడి కుమారుడి చదువుకు శివ కార్తికేయన్ సాయం.. వీడియో ఇదిగో
ఆ నటుడి కుమారుడి చదువుకు శివ కార్తికేయన్ సాయం.. వీడియో ఇదిగో
హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్..ఆర్సీబీ ప్లేయర్‎కు డిమెరిట్ పాయింట్
హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్..ఆర్సీబీ ప్లేయర్‎కు డిమెరిట్ పాయింట్
నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో తులం
నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో తులం
ఎవ్వరూ బ్రేక్ చేయలేని లిస్ట్‌లో సన్‌రైజర్స్ నయా బ్రహ్మాస్త్రం.!
ఎవ్వరూ బ్రేక్ చేయలేని లిస్ట్‌లో సన్‌రైజర్స్ నయా బ్రహ్మాస్త్రం.!
వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి
వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?