RBI: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరోసారి అదే కొనసాగింపు..
RBI Repo Rate: నేడు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను యధాతధంగా ఉంచాలని నిర్ణయించింది. 5.25 శాతంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల వడ్డీ రేట్లు రెపో రేటు ప్రకారం మారుతూ ఉంటాయనే విషయం తెలిసిందే.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు బుధవారం ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు దీని గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉండగా.. దానినే కొనసాగించేందుకు మొగ్గు చూపింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త కారణాలతో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇంధన, శక్తి, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల క్రమంలో ఎప్పటిలాగే ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు ప్రారంభయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో తొలి రోజు వడ్డీ రేట్లపై చర్చించారు.
ద్రవ్యోల్బణంపై ప్రభావం
గత ఏడాది రెపో రేటును 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గించారు. ఆ తర్వాత రెపో రేటులో మార్పులు చోటుచేసుకోలేదు. దీని వల్ల బ్యాంకుల్లో ప్రస్తున్న ఉన్న వడ్డీ రేట్లే ఫిక్స్ డ్ డిపాజిట్లు, రుణాలకు వర్తించనున్నాయి. రేపో రేట్లను సవరిస్తే బ్యాంకులు దానిని తగ్గట్లు వడ్డీ రేట్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం మొదలైనప్పటి నుంచి గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఇక ముడి చమురు ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. అటు గ్యాస్ ధరలు కూడా పెరిగి సామాన్యులకు షాకిచ్చాయి. ఇటీవల ఏప్రిల్ 1వ తేదీన కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారు. భారత్ ముడి చమురు, గ్యాస్‌ను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి కోసం భారీగా ఖర్చు పెడుతున్నందున ఇంధనం, గ్యాస్ ధరలు ఆర్ధిక వ్యవస్థపై ఒత్తిడిని కలగిస్తు్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఇది ప్రభావితం చూపిస్తుంది.
ధరలపై ఒత్తిడి
డిసెంబర్ 2025లో ద్రవ్యోల్బణం 1.33 శాతం ఉండగా.. ఫిబ్రవరి నాటికి 3.21 శాతానికి చేరుకుంది. ఇక మార్చి లెక్కులు బయటకు రాలదు. యుద్దం, సరఫరాలో అంతరాయం కారణంగా ధరలపై ఒత్తిడి పెరిగింది. దీని వల్ల అధిక ద్రవ్యోల్బణం రాబోతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. దీని వల్ల బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ ఉంటాయి. ప్రస్తుతం వడ్డీ డిపాజిట్ల కంటే రుణాల వృద్ది బ్యాంకుల్లో ఎక్కువగా కొనసాగుతోంది. దీని వల్ల బ్యాంకులకు ఆకర్షణీయమైన ఎఫ్‌డీ రేట్లను కొనసాగించేలా ప్రోత్సహిస్తుంది. బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను పెంచితే పెట్టుబడిదారులు ఎక్కువమంది తమ డబ్బును డిపాజిట్ చేస్తారు
