AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fan: రోజంతా ఫ్యాన్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా? దాన్ని తగ్గించడం ఎలా?

వేసవి కాలం మొదలైందంటే చాలు సామాన్యుడికి కరెంట్ బిల్లు షాక్ ఇస్తుంది. ఎందుకంటే సమ్మర్‌లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత దృష్ట్యా 24 గంటల పాటు ఫ్యాన్ వేయడం ఒక అలవాటుగా మారింది. అయితే, ఒక సీలింగ్ ఫ్యాన్ నెలకు ఎంత విద్యుత్తును వినియోగిస్తుంది? మీ బిల్లులో దాని వాటా ఎంత? అసలు ఈ ఖర్చును సగానికి సగం ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

Fan: రోజంతా ఫ్యాన్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా? దాన్ని తగ్గించడం ఎలా?
Fan Electricity Saving Per Month
Anand T
|

Updated on: Apr 28, 2026 | 8:38 PM

Share

సమ్మర్ వచ్చిందంటే చాలూ ఇంట్లో ఫ్యాన్ 24 గంటలు తిరగాల్సిందే. లేదంటే మనం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేమ్. దీని వల్ల వేసవిలో కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది. అయితే మన ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ 24 గంటలు తిరిగితే మనకు ఎంత కరెంటు బిల్లు వస్తుందో మీర ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఈ డౌట్ వచ్చుంటే కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. మనం ఇళ్లలో వాడే సీలింగ్ ఫ్యాన్లు సాధారణంగా 60W నుండి 80W విద్యుత్తును తీసుకుంటాయి.

రోజుకు 10 గంటలు ఫ్యాన్ తిరిగితే ఎంత కరెంటు బిల్లు వస్తుంది?

ఉదాహరణకు మీ ఇంట్లో 75W సామర్థ్యం ఉన్న ఫ్యాన్ ఉందనుకుంటే ఆ ఫ్యాన్ ఒక గంట తిరిగితే 0.075 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే ఒక రోజు మొత్తం మనం సాధరణంగా 10 గంటలు ఆ ఫ్యాన్ వాడితే, రోజుకు 0.75 యూనిట్లు విద్యుత్‌ ఖర్చవుతుంది. ఇక నెల మొత్తం ఎంత విద్యుత్‌ కాలుతుందనే చూసుకుంటే.. 30 రోజులకు సీలింగ్‌ ఫ్యాన్‌కు 22.5 యూనిట్లు ఖర్చవుతుంది. ఒక్క యూనిట్‌ధర సగటున రూ. 7 అనుకుంటే ఒక్క ఫ్యాన్ వల్ల మనకు నెలకు రూ.157.50 కరెంటు బిల్లు వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో 3 లేదా 4 ఫ్యాన్లు ఉంటే, కేవలం ఫ్యాన్ల కోసమే నెలకు రూ. 450 నుండి 650 వరకు కరెంటు బిల్లు వస్తుంది.

తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే ఫ్యాన్స్

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న BLDC (Brushless Direct Current) ఫ్యాన్లు విద్యుత్ ఆదాలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి.ఈ ఫ్యాన్‌లు కేవలం 25W నుండి 35W విద్యుత్ మాత్రమే వాడుకుంటాయి. మీరు మీ ఇంట్లో సాధారణ ఫ్యాన్స్‌కు బదులు ఈ ఫ్యాన్‌లను వాడితే సుమారు 60 శాతం వరకు విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. దీని వల్ల నెల రోజుల్లో వచ్చే కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. అంటే పాత ఫ్యాన్ వల్ల నెలకు రూ.157 బిల్లు వస్తే, ఈ కొత్త ఫ్యాన్ వల్ల నెలకు రూ. 60 నుండి 70 మధ్యలోనే బిల్లు వస్తుంది.

కరెంటు బిల్లు తగ్గించుకోవడం ఎలా

చాలామంది గదిలో నుండి బయటకు వెళ్లేటప్పుడు ఫ్యాన్ ఆపడం మర్చిపోతుంటారు. దీనివల్ల కరెంటు వినియోగం పెరుగుతుంది. అలాగే అవసరం లేని సమయంలో ఫ్యాన్ స్పీడ్ తగ్గించడం వల్ల కూడా కొంత విద్యుత్ ఆదా అవుతుంది. ఫ్యాన్ రెక్కలపై పేరుకుపోయిన దుమ్ము వల్ల మోటార్‌పై భారం పడి విద్యుత్ వినియోగం పెరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్యాన్లను శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో 10 ఏళ్ల కంటే పాతవైన ఫ్యాన్లు ఉంటే వాటిని వెంటనే మార్చేయండి. ఎందుకంటే అవి ఎక్కువ కరెంట్ వినియోగిస్తాయి. వాటి స్థానంలో స్టార్ రేటింగ్ ఉన్న ఫ్యాన్లను వాడటం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us