AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..?

పాము అంటేనే విషానికి మారుపేరు. కానీ, ఒక పాముకి పుట్టుకతోనే విషం ఉండదంటే మీరు నమ్ముతారా..? అవును.. మనం చెప్పుకోబోయే ఈ వింత పాముకి సొంతంగా విషాన్ని తయారు చేసుకునే శక్తి లేదు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాముల జాబితాలో ఉంటుంది. తను తినే ఆహారం నుంచే విషాన్ని దొంగిలించి, శత్రువుల మీద ప్రయోగించే దీన్ని స్టోరీ తెలుసుకుందాం..

విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..?
Red Necked Keelback Snake Facts
Krishna S
|

Updated on: Apr 28, 2026 | 8:33 PM

Share

సాధారణంగా పాము అంటేనే విషం.. కానీ ప్రకృతిలో ఒక విచిత్రమైన పాము ఉంది. దీనికి జన్యుపరంగా విషాన్ని ఉత్పత్తి చేసే శక్తి లేదు. అయినప్పటికీ ఇది అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాముగా చలామణి అవుతోంది. అదే రెడ్ నెక్డ్ కీల్‌బ్యాక్. తాను తినే ఆహారం నుంచే విషాన్ని అరువు తెచ్చుకుని, తన ప్రాణాలను కాపాడుకునే ఈ పాము జీవనశైలి శాస్త్రవేత్తలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 కప్పల నుంచి విషం సేకరణ

ఈ పాము ప్రధానంగా విషపూరితమైన కప్పలను వేటాడి తింటుంది. సాధారణంగా ఆ కప్పల విషం ఇతర జీవులకు ప్రాణసంకటంగా మారుతుంది. కానీ ఈ కీల్‌బ్యాక్ పాము శరీరం ఆ విషాన్ని తట్టుకోవడమే కాకుండా దానిని తన అవసరానికి వాడుకుంటుంది. విషపూరిత కప్పల చర్మంపై ఉండే ఈ రసాయనాలను పాము జీర్ణించుకోకుండా, తన రక్తప్రవాహం ద్వారా మెడ భాగంలోని ప్రత్యేక గ్రంథులకు చేరవేస్తుంది. పాము మెడ వెనుక ఉండే ఈ గ్రంథులే విషానికి స్టోరేజ్ పాయింట్లు. శత్రువు దాడి చేసినప్పుడు ఈ గ్రంథుల నుంచి విషాన్ని చిమ్మి తనను తాను రక్షించుకుంటుంది.

విషం ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా..

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ పాములకు తమ శరీరంలో ఎంత విషం ఉందో ముందే తెలుస్తుందని సమాచారం. ఒకవేళ పాము తిన్న ఆహారంలో విషం ఎక్కువగా ఉంటే, అది శత్రువుల ముందు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. తన మెడను పైకి ఎత్తి గ్రంథులను ప్రదర్శిస్తూ ఎదుటి జీవిని భయపెడుతుంది. ఒకవేళ అది తిన్న ఆహారంలో విషం లేకపోతే లేదా గ్రంథులు ఖాళీగా ఉంటే, అది పోరాటానికి దిగకుండా చాలా నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు

జపాన్‌లోని నాగోయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఒక అద్భుతమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పాములు తమ ప్రవర్తనను కేవలం అవకాశవాదం లాగా కాకుండా, తమ రక్షణ సామర్థ్యాన్ని బట్టి మార్చుకుంటాయని తేలింది. తమ మెడలోని విషం అయిపోయినప్పుడు కూడా శత్రువులను తప్పుదోవ పట్టించడానికి ఇవి బ్లఫ్ చేస్తాయని కూడా కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని సీక్వెస్టరింగ్ జీవులుగా పిలుస్తారు. అంటే ఇతరుల నుంచి రసాయనాలను సేకరించి దాచుకునే అరుదైన గుణం వీటికి ఉంది.

జీవవైవిధ్యంలో మనుగడ సాగించడానికి ప్రకృతి ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇస్తుంది. రెడ్ నెక్డ్ కీల్‌బ్యాక్ పాము విషయంలో అది ‘అరువు తెచ్చుకున్న విషం. తన ఆహారాన్నే ఆయుధంగా మార్చుకున్న ఈ పాము కథ, ప్రకృతిలోని వింతలకు ఒక నిలువెత్తు నిదర్శనం.

Follow Us
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం