హిమాలయ కొండల్లో లభించే ఆరోగ్య సంజీవని..ప్రయోజనాలు తెలిస్తే

28 April 2026

Jyothi Gadda

ఇది పర్వత ప్రాంతాల్లోని నీటి కాలువలు (గధేరాలు), తేమ ఎక్కువగా ఉండే చోట్ల సహజంగా పెరుగుతుంది. దీనిని పండించరు. ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధంగా లభించే ఆర్గానిక్ ఆహారం. అద్భుతమైన ఔషధ గని. 

లింగుడాలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

గుండె ఆరోగ్యం: లింగుడాలో కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు దాదాపు శూన్యం. ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మధుమేహం నియంత్రణ: ఈ కూరగాయ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

రోగనిరోధక శక్తి: ఇందులోని విటమిన్ల వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. 

జీర్ణక్రియ, కీళ్ల నొప్పులు: పర్వత ప్రాంత ప్రజల నమ్మకం ప్రకారం, లింగుడా తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.

లింగుడాను ప్రధానంగా కూరగా వండుకుంటారు. దీని రుచి చాలా వెరైటీగా, అద్భుతంగా ఉంటుంది. స్థానికులు దీనితో రుచికరమైన పచ్చళ్లు (Pickles) కూడా తయారు చేస్తారు.

వర్షాకాలం ప్రారంభంలో ఇవి మార్కెట్లోకి రావడం మొదలవుతాయి. స్థానిక మార్కెట్లలో వీటికి మంచి ధర లభిస్తుంది, ఇది అక్కడి రైతులకు, అటవీ ప్రాంత ప్రజలకు అదనపు ఆదాయ వనరుగా మారింది.