అమెరికా, చైనాల కంటే భారతీయ మహిళలే సంపన్నులు.. మన దేశానికి వెన్నె ముక అని తెలుసా
భారతీయ మహిళలకు బంగారం అంటే ఎనలేని ప్రేమ. ఇంకా చెప్పాలంటే విడదీయరాని బంధం.. బంగారం కొనడం అనేది కేవలం స్టేటస్ కోసమే కాదు... ఆర్ధిక భరోసా కోసం కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాయి. అసలు భారతీయ మహిళల శక్తి తెలుసా...ప్రపంచ బంగారు మండలి నివేదిక ప్రకారం అగ్ర రాజ్యం అమెరిక, అబివృద్ధి చెందిన చైనా దేశాల కంటే.. భారతీయ మహిళల వద్దే ఎక్కువగా బంగారం ఉంది. ఈ బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు "దాచిన శక్తి" అని నిపుణులు అంటున్నారు.

భారతీయ మహిళలకు బంగారం మీద ఉండే మోజు అంతా ఇంతా కాదు. ఎటువంటి సందర్భం వచ్చినా ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు తమ స్తోమతను బట్టి బంగారం కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తారు. కొంత మంది బంగారాన్ని పెట్టుబడి రూపంలో పొదుపు చేసేందుకు కొనుగోలు చేస్తే.. మరికొంత మంది నగల మీద మోజుతో కొనుగోలు చేస్తారు. అయితే భారతీయ మహిళలకు బంగారం మీద ఉన్న మోజే.. ఈ రోజు మన దేశ ఆర్ధిక ప్రజ్ఞలు పెట్టని కోట అని తెలుసా.. అసలు మన స్త్రీల దగ్గర ఉన్న బంగారం.. ప్రపంచంలోని పెద్ద పెద్ద ఆర్ధిక వ్యవస్థ ఉన్న దేశాలకంటే ఎక్కువ ఉంది.
భారతీయ మహిళల దగ్గరే ప్రపంచంలోనే ఎక్కువ బంగారం ఉంది. అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, జపాన్‌తో సహా పది ఇతర దేశాల కంటే కూడా మన మగువల వద్దే ఎక్కువ బంగారం ఉంది. ఇటీవలి నివేదిక ప్రకారం భారతీయ మహిళలు దాదాపు 25,488 టన్నుల బంగారం కలిగి ఉన్నారు.
ఈ మొత్తం ప్రపంచంలోని అనేక ప్రధాన దేశాల మొత్తం బంగారు నిల్వలను మించిపోయింది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ 2024 నివేదిక ప్రకారం.. దేశీయ బంగారు నిల్వలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. భారతీయ మహిళలు దాదాపు 24,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నారు. ఇది ప్రపంచంలోని మొత్తం ఆభరణాల బంగారంలో దాదాపు 11% ప్రాతినిధ్యం వహిస్తుంది.
భారతీయ మహిళలు దగ్గర ఉన్న బంగారం మొత్తం గురించి తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం మొత్తం ప్రపంచంలోని టాప్ 10 దేశాల మొత్తం బంగారు నిల్వల కంటే ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద అధికారిక బంగారు నిల్వలను కలిగి ఉన్న యునైటెడ్ స్టేట్స్ 8,133 టన్నులను కలిగి ఉంది. అదే సమయంలో చైనా 2,279 టన్నులు, రష్యా 2,332 టన్నులు మాత్రమే కలిగి ఉంది. ఇటీవలి నివేదిక ప్రకారం.. భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం 2024 నుంచి 2025 వరకు పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు 25,000 టన్నులను మించిపోయింది.
భారతీయ మహిళలు దగ్గర ఉన్న బంగారాన్ని ద్రవ్య విలువలో(నగదు రూపంలో) లెక్కించినట్లయితే.. బంగారం విలువ $1.5 ట్రిలియన్లకు పైగామన దేశ కరెన్సీలో రూ. 13,18,14,37,50,00,000 ఉంటుందని.. అంటే భారతదేశ GDPలో దాదాపు సగం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఏ దేశంలో ఎంత బంగారం ఉందంటే
దేశం బంగారు నిల్వలు (టన్నుల్లో)
- భారతదేశ మహిళలు 25488
- అమెరికా 8,133
- జర్మనీ 3,351
- ఇటలీ 2,451
- ఫ్రాన్స్ 2,437
- రష్యా 2,332
- చైనా 2,279
- స్విట్జర్లాండ్ 1,039
- జపాన్ 845
- నెదర్లాండ్స్ 612
- పోలాండ్ 448
దక్షిణ భారత మహిళల దగ్గరే 40% బంగారం
మీడియా నివేదికల ప్రకారం ఉత్తరాది వారి కంటే దక్షిణాది వారి దగ్గరే బంగారం ఎక్కువ ఉందని తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలోని మహిళలే బంగార యజమానులు. భారతదేశంలో మహిళల వద్ద ఉన్న మొత్తం బంగారంలో దక్షిణ ప్రాంతం 40% కలిగి ఉంది. తమిళనాడులోనే 28% బంగారం ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2020–21 అధ్యయనం ప్రకారంభారతీయ కుటుంబాల దగ్గర 21,000 నుంచి 23,000 టన్నుల మధ్య బంగారం ఉంది.
2024-25 కి ఈ బంగారం నిల్వ సుమారు 24,000 నుంచి 25,000 టన్నులకు లేదా 25,000,000 కిలోలకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది దేశ సంపదలో విస్తారమైన భాగాన్ని సూచిస్తుంది. ఈ బంగారు నిల్వ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతు ఇస్తుంది. దేశ GDPలో దాదాపు 40% కవర్ చేస్తుంది.
భారతీయ మహిళల వద్ద ఉన్న ఈ బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు “దాచిన బలం” అని నిపుణులు అంటున్నారు. దానిలో కొంత భాగాన్ని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువస్తే.. అది పెట్టుబడి, వృద్ధి రెండింటినీ పెంచుతుందని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








