Stock Market: అంతర్జాతీయ పరిణామాల మధ్య ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. ఫోకస్ లో ఏవియేషన్ స్టాక్స్..
Stock Market: ఈ రోజు గ్లోబల్ మార్కెట్లతో పాటు విదేశీ సంస్థాగత మదుపరులు, ఎఫ్ అండ్ ఓలు న్యూట్లల్ ఉన్నందున దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిన్న దేశీయం మార్కెట్లలో కీలక సూచీ సెన్సెక్స్ 350 పాయింట్ల మేర నష్టాల్లో ముగిసింది.
Stock Market: ఈ రోజు గ్లోబల్ మార్కెట్లతో పాటు విదేశీ సంస్థాగత మదుపరులు, ఎఫ్ అండ్ ఓలు న్యూట్లల్ ఉన్నందున దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిన్న దేశీయం మార్కెట్లలో కీలక సూచీ సెన్సెక్స్ 350 పాయింట్ల మేర నష్టాల్లో ముగిసింది. ఈ తరుణంలో ఉదయం 9.20 గంటలకు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆరంభంలో కీలక సూచీలు కొంత నెగటివ్ గా ప్రారంభమైనప్పటికీ.. వెంటనే కోలుకున్నాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ తీవ్ర ప్రభావానికి గురవుతోంది. ఈ సమయంలో కీలక సూచీలైన సెన్సెక్స్ 163 పాయింట్లు, నిఫ్టీ-50.. 42 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 16 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 157 పాయింట్ల మేర లాభాల్లో ఉన్నాయి. ఈ రోజు ప్రధానంగా ఏవియేషన్ రంగానికి చెందిన షేర్లు ఫోకస్ లో ఉన్నాయి. రష్యా చమురుపై యూరోపియన్ ఆంక్షలు, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ కావటం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్ల ప్రారంభంలో ఏషియా పెయింట్స్ 1.93%, ఎన్టీపీసీ 1.70%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.59%, టైటాన్ కంపెనీ లిమిటెడ్ 1.50%, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 1.47%, హిందుస్థాన్ యూనీలివర్ 1.40%, హిందుస్థాన్ పెట్రోలియం 1.45%, ఐటీసీ 1.20%, టాటా స్టీల్ 1.06%, బజాజ్ ఆటో 0.90% మేర లాభపడి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో హిందాల్కో 1.28%, డాక్టర్ రెడ్డీస్ 0.59%, ఓఎన్జీసీ 0.56%, విప్రో 0.41%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 0.30%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.26%, సన్ ఫార్మా 0.24%, ఇన్ఫోసిస్ 0.24%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.09%, అల్ట్రా టెక్ 0.07% మేర నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.